Ram Charan: డాడీ సినిమా హిట్టే.. కానీ కాలెక్షన్సే..! రిమేక్స్ విషయంలో చెర్రీ కీలక నిర్ణయం

గాడ్‌ ఫాదర్ సినిమాకు మంచి టాక్‌ వచ్చినా.. వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

Ram Charan: డాడీ సినిమా హిట్టే.. కానీ కాలెక్షన్సే..! రిమేక్స్ విషయంలో చెర్రీ కీలక నిర్ణయం
Chiranjeevi - Ram Charan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2022 | 11:35 AM

రీసెంట్ టైమ్స్‌లో చాలా మంది హీరోలు ఒరిజినల్‌ కథల కన్నా… రీమేక్‌ ప్రాజెక్ట్సే సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అయితే రిస్క్ తక్కువని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ విషయంలో రామ్‌ చరణ్ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ముఖ్యంగా గాడ్ ఫాదర్ రిలీజ్ తరువాత రీమేక్స్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు మెగా పవర్ స్టార్‌. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాడ్‌ ఫాదర్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్‌ వచ్చినా.. వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

గాడ్ ఫాదర్ సినిమాకు వన్‌ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన చెర్రీ… ఆ మూవీ వసూళ్ల మీద బిగ్ రిసెర్చే చేశారు. తొలి వారం మంచి వసూళ్లు సాధించిన గాడ్‌ ఫాదర్‌కు సెకండ్ వీక్‌లోనే కాంతార వల్ల ఇబ్బంది ఎదురైంది. ఈ సినిమాకు నేషనల్ లెవల్‌లో క్రేజ్‌ రావటంతో ఆ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ మీద కూడా కాస్త గట్టిగానే కనిపించింది. గాడ్ ఫాదర్‌ వసూళ్ల మీద ప్రభావం చూపిన మరో అంశం రీమేక్ కావటం. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. గాడ్‌ ఫాదర్‌ ప్రపొజల్‌ కన్నా ముందునుంచే లూసీఫర్ తెలుగు వర్షన్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. దీంతో చిరు సినిమా మీద కాస్త క్రేజ్‌ తగ్గిందన్న అంచనాలు ఉన్నాయి.

గాడ్‌ ఫాదర్ రిలీజ్‌ టైమ్‌కి ఓటీటీలో ఒరిజినల్ వర్షన్ అందుబాటులో ఉండటం… లూసీఫర్‌ కథకు చాలా మార్పులు చేసిన గాడ్‌ ఫాదర్‌ మెయిన్ పాయింట్ కూడా అదే కావటంతో అనుకున్న స్థాయిలో ఆడియన్స్ థియేటర్లకు రాలేదన్న అంచనాకి వచ్చేశారు రామ్ చరణ్‌. అందుకే ఇక మీదట రీమేక్ సినిమా ఓకే చేయాలంటే… కొత్త కండిషన్స్ పెడుతున్నారు. రీమేక్‌ సబ్జెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వాలంటే ఆ మూవీ ఓటీటీలో లేకుండా చూసుకోవాలని నిర్మాతలను కోరుతున్నారు చెర్రీ. అలా కుదరకపోతే… రీమేక్‌ల జోలికి పోకపోవటమే బెటర్ అంటున్నారు. ఇంతకీ రీమేక్‌ల కోసం ఒరిజినల్ మూవీస్‌ని ఓటీటీల నుంచి తొలగించటం సాధ్యమేనా…? ప్రాక్టికల్‌గా అది సాధ్యమేనా…? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..