Ram Charan : ఎంత శంకర్ సినిమా అయినా.. పాట కోసం పాతికకోట్లు ఏంటి స్వామి..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరపైకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. అలాగే ఈసినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం అటు మెగా అభిమానులు.. ఇటు నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. చరణ్- కియారా కలిసి గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఈ సినిమా సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీనిను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాగా ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారని ఇందులో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని కొద్దిరోజులుగా వార్తలు చెక్కారు కొడుతున్నాయి. మరికొంతమంది చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తాజాగా ఫిలిం సర్కిల్స్ లో విహారం చేస్తుంది. మాములుగా శంకర్ సినిమాలో పాటలకు గ్రాండియర్ లుక్ ఉంటుంది. అద్భుతమైన లొకేషన్స్ తో పాటు ఓ కాన్సెప్ట్ తో పాటలను తెరకెక్కిస్తారు శంకర్. ఇప్పుడు చరణ్ సినిమాకోసం కూడా అలాంటి ఓ పాటను తెరకెక్కించాలని చూస్తున్నారట. ఈ పాట కోసం ఏకంగా శంకర్ 25 కోట్లు ఖర్చు చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పాటకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారట. అందుకోసమే అంత ఖర్చు అని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :