Ram Charan: వెర్సటాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా చరణ్.. ప్రతిపాత్రలోనూ వైవిధ్యమే
ఒకప్పుడు వెర్సటాలిటీకి, నేచురాలిటీకి పర్‌ఫెక్ట్ కేరాఫ్ ఎవరంటే కమల్‌హాసన్ పేరే చెప్పేవాళ్లు. తర్వాత చాలామంది కమల్‌ని ఫాలో అవుతూ ప్రయోగాలు చేసినా..
ఒకప్పుడు వెర్సటాలిటీకి, నేచురాలిటీకి పర్‌ఫెక్ట్ కేరాఫ్ ఎవరంటే కమల్‌హాసన్ పేరే చెప్పేవాళ్లు. తర్వాత చాలామంది కమల్‌ని ఫాలో అవుతూ ప్రయోగాలు చేసినా.. ఆయనకు రీప్లేస్‌మెంట్ కాలేకపోయారు. లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరోని కమల్‌తో పోల్చడం మొదలైంది. ఇంతకీ ఎవరా హీరో అంటే గట్టిగ వినిపిస్తున్న పేరు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. నిజాయితీపరుడైన పల్లెటూరబ్బాయి.. పైగా వినికిడిలోపం. ఇంతటి పెక్యూలియర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకుని దాన్ని చెర్రీ చేతిలో పెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్ సుకుమార్. ఆ విధంగా చిట్టిబాబుగా మొదలుపెట్టి.. తనకున్న మెగాపవర్‌స్టార్ ఇమేజ్‌ని కూడా త్యాగం చేసి, వెర్సటాలిటీని కంటిన్యూ చేస్తున్నారు చరణ్. ఆయన కమిట్‌మెంట్‌కి రాజమౌళి రాసుకున్న రామరాజు పాత్ర పరాకాష్ట. కమర్షియల్ హీరోగానే మొదలై.. క్యారెక్టరైజేషన్‌లో ఎక్స్‌పరిమెంట్స్ జోలికెళ్లకుండా నిన్నమొన్నటిదాకా నేరుగానే నడిచారు చెర్రీ. ఆరంజ్‌లో హాట్ అండ్ క్యూట్ లుక్స్‌తో మోడ్రన్ లవర్‌బాయ్‌గా నటించి కాస్త ఫేస్ టర్న్ ఇచ్చుకున్నారు. మిగతావన్నీ యాక్షన్ హీరోగా చేసిన పక్కా కమర్షియల్ సినిమాలే.
ధ్రువ, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కంటెంట్ డిమాండ్ చేసిందో లేక కెప్టెన్లు కోరుకున్నారో గానీ.. గెటప్‌లో కాస్త వేరియేషన్స్ చూపించారు. నాలుగేళ్ల కిందట చేసిన రంగస్థలం చిట్టిబాబు పాత్ర.. చెర్రీ కెరీర్‌లోనే మోస్ట్ రిమార్కబుల్. ఆస్కార్ రేంజ్‌లో పెర్ఫామెన్స్ ఇచ్చావ్ అంటూ బాబాయ్ పవర్‌స్టార్ చేతనే కాంప్లిమెంట్ ఇప్పించుకున్న రేరెస్ట్ క్రెడిట్ చరణ్‌ది. ఇప్పుడు రామరాజుగా ఒకే సినిమాలో మల్టిపుల్ వేరియేషన్స్ చూపిన రామ్‌చరణ్… ఆ తర్వాతి సినిమాలో అంతకుమించి అంటూ హింట్ ఇచ్చేశారు. ఆచార్యలో సిద్ధుడి పాత్రలో కూడా రొటీనిటీ లేదు. రిసెంట్‌గా శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఆర్‌సీ15 నుంచి చెర్రీ లుక్ ఒకటి లీకైంది. పంచెకట్టుతో సైకిల్ తొక్కుతూ గ్రామీణ యువకుడిగా కనిపిస్తున్న చెర్రీ.. సినిమా కంటెంట్‌తో పాటు కమర్షియల్ వ్యాల్యూ మీదా అంచనాలు పెంచేశాడు. త్వరలో సుక్కూతోనే మరో సినిమా చెయ్యబోతున్న చరణ్.. నటుడిగా సరికొత్త హైట్స్‌ని టచ్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్‌నిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :