Rashmika Mandanna : ఆల్ ఇండియా పర్మిట్.. నేషనల్ క్రష్ రేంజ్ నెక్స్ట్ లెవల్
ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ నార్త్ ఇండస్ట్రీ షేక్ చేశాడు మన పుష్పరాజ్. బన్నీతో జత కట్టి ఆల్ ఇండియా పర్మిట్ సొంతం చేసుకుని.. జైత్రయాత్ర కంటిన్యూ చేస్తున్నారు శ్రీవల్లి అలియాస్ రష్మిక.
ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ నార్త్ ఇండస్ట్రీ షేక్ చేశాడు మన పుష్పరాజ్. బన్నీతో జత కట్టి ఆల్ ఇండియా పర్మిట్ సొంతం చేసుకుని.. జైత్రయాత్ర కంటిన్యూ చేస్తున్నారు శ్రీవల్లి అలియాస్ రష్మిక(Rashmika Mandanna). సౌత్ టు నార్త్… ఆమెదే ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. పదహారణాల తెలుగందంతో మెరిసే ఈ అమ్మడు తెలుగమ్మాయి కాదంటే అస్సలు నమ్మబుద్ధెయ్యదు. మలబారు సీమ నుంచి మన కోసమే అన్నట్టు దిగుమతైన రష్మికను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు శ్రీవల్లిగా తన క్రేజ్‌న విశ్వవ్యాప్తం చేసుకుంటోంది ఈ కామ్రేడ్ బ్యూటీ. పుష్ప సినిమా ఐకాన్‌స్టార్‌ని పాన్ ఇండియా హీరోగా మార్చినట్టే.. రష్మికను నేషనల్ క్రష్మికగా మార్చేసింది. సరిలేరు నీకెవ్వరుతో టాప్ హీరోలతో జర్నీ మొదలుపెట్టిన ఛలో బ్యూటీ.. ఇప్పుడు ఆలిండియా పర్మిట్‌తో భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తోంది. సందీప్‌వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్ హీరోగా చేస్తున్న యానిమల్ మూవీలో రష్మికదే మెయిన్ ఫిమేల్ లీడ్.
గుడ్‌బై మూవీలో బిగ్‌బీ అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. బాలీవుడ్‌లో కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నారు రష్మిక. ఇలా నార్త్‌లో టాప్‌గేర్‌లో నడుస్తూనే.. సౌత్‌లో కూడా బిగ్ సైజ్ ప్రాజెక్టుల్ని టేకప్ చేస్తున్నారు. వైజయంతీ బేనర్‌పై హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీలో ముస్లిం మహిళగా మరో వేరియేషన్ ట్రై చేస్తున్నారు సుల్తాన్ సుందరి. పుట్టినిల్లు శాండల్‌వుడ్ అయితే.. మెట్టినిల్లు టాలీవుడ్. అలాగని ఏ లాంగ్వేజ్‌నీ వదిలిపెట్టకుండా ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్న మిషన్ మజ్ను.. లేటెస్ట్‌గా వంశీ పైడిపల్లి మల్టిలింగువల్‌లో పార్టిసిపేషన్ తీసుకుంది. కోలీవుడ్ దళపతి విజయ్‌కి జోడీగా నటించబోతున్న ఈ సినిమా రష్మిక గ్రాఫ్‌కి మంచి ఎలివేషన్ తీసుకొచ్చే ఛాన్సుంది. సో, పట్టుకుందల్లా బంగారమౌతోందన్నమాట టాప్‌టక్కర్ బ్యూటీకి.
మరిన్ని ఇక్కడ చదవండి :