AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghani Movie Trailer: కుర్ర హీరో ట్రైలర్‌కు కోటి వ్యూస్.. దూసుకుపోతున్న వరుణ్ తేజ్ గని

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ ఆతర్వాత మెగా ప్రిన్స్ గా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు.

Ghani Movie Trailer: కుర్ర హీరో ట్రైలర్‌కు కోటి వ్యూస్.. దూసుకుపోతున్న వరుణ్ తేజ్ గని
Ghani
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2022 | 8:48 AM

Share

Ghani Movie : మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్( Varun Tej) ఆతర్వాత మెగా ప్రిన్స్ గా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమాలో తన నటనతో మరో మెట్టు పైకెక్కాడు వరుణ్. ఇక ఈ యంగ్ హీరో తాజాగా నటిస్తున్న సినిమా గని. కిరణ్ కొర్రిపాటి(Kiran Korrapati) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను అల్లు బాబీ కంపెనీ,  సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్య విడుదలైన రోమియో జూలియట్ పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.

ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.. సినిమాపై అంచనాలు పెంచేసింది. తమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధానఆకర్షణగా నిలిచింది. తాజాగా ‘గని’ ట్రైలర్ 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దబాంగ్ 3 బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మధ్యే హీరో వరుణ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..