Varun Tej: ఫుల్ జోష్‌లో మెగాహీరో.. యాక్షన్ ఎంటర్టైనర్‌కు డబ్బింగ్ పూర్తి చేసిన వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద..
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు, పాటలు, గ్లిమ్ప్స్ ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.
ఇక బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ‘గని’ సినిమాను పూర్తిచేశాడు. రీసెంట్ గా ఆయన డబ్బింగ్ చెప్పడంతో ఆ సినిమాకి సంధించిన ఆ పనులు కూడా పూర్తయ్యాయి. మార్చి 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమా చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ 3 మూవీ షూటింగ్ శరవేగం పూర్తి చేసుకుంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?