Avika Gor: నేను అద్దంలోకి చూసుకోవడానికి ఇష్టపడను.. నెటిజన్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అవికా
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అందరికి పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్. ఆతర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది.
Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అందరికి పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్. ఆతర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిపోయింది ఈ చిన్నది. రాజ్ తరుణ్ తో చేసిన ఉయ్యాలా జంపాల సినిమాతోపాటు సినిమా చూపిస్తా మామ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ అమ్మడు ఎక్కడికిపోతావ్ చిన్నవాడా సినిమాతో మరో హిట్ కొట్టింది. ఆ తర్వాత రాజుగారి గది 3 సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కిసింది. ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లో రాణించాలని చూస్తుంది ఈ అమ్మడు. ఇదే సమయంలో గ్లామర్ రోల్స్ కి ఈ బ్యూటీ దూరంగా ఉంటూ వస్తుంది. కానీ ఇటీవల వచ్చిన`నెట్` అనే చిత్రంలో కాస్త బోల్డ్ గా నటించి మెప్పించింది అవికా.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. అయితే ఈ భామ ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది అన్న గుసగుసలు వినిపించాయి. బొద్దు అందంతో చబ్బీ లుక్ లో కి మారిపోయింది. అయితే ఈ అమ్మడి పై తాజా సోషల్ మీడియాలో ట్రోల్స్ కి దిగారు పలువురు. అయితే ఈ విమర్శకులకు గట్టిగా సమాధానం చెప్పింది అవికా. “నన్ను నేను చాలా అసహ్యించుకుంటున్నాను. నా శరీరాన్నిఅంతగా పట్టించుకోలేదు. అలాగని నేనేమీ బాధపడలేదు. నేను నా నటనపైనే దృష్టి పెడతాను. ఎందుకేంటే నేను అద్దంలోకి చూసుకోవడానికి ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్ల నోరు మూయించింది అవికా. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమాలో నటిస్తుంది అవికా గోర్.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?