Varun Tej Marriage: త్వరలోనే మెగా హీరో పెళ్లి.. వరుణ్ తేజ్ మ్యారేజ్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

ముఖ్యంగా కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్చ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు తన తనయుడు వరణ్ తేజ్ మ్యారెజ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Varun Tej Marriage: త్వరలోనే మెగా హీరో పెళ్లి.. వరుణ్ తేజ్ మ్యారేజ్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
Varun Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 9:34 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే నాగశౌర్య, కార్తీకేయ ఓ ఇంటివారు కాగా.. ఇటీవలే హీరో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని.. అన్ స్టాపబుల్ షోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీక్ చేశాడు. దీంతో అభిమానులంతా డార్లింగ్ మ్యారేజ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మిగిలింది వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ మాత్రమే. దీంతో వీరి పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్లో టాక్ మొదలైంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్చ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు తన తనయుడు వరణ్ తేజ్ మ్యారెజ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని.. తన మ్యారెజ్ గురించి స్వయంగా వరుణ్ ప్రకటిస్తాడని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన విషయాలను ఇప్పుడే చెప్పలేనని.. అన్ని విషయాలు కేవలం వరుణ్ మాత్రమే వెల్లడిస్తారని అన్నారు. ప్రస్తుతం వరుణ్ వేరే ఇంట్లో ఉంటున్నాడని.. మ్యారెజ్ తర్వాత కూడా తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటారని చెప్పారు నాగబాబు.

వేరు వేరుగా ఉన్నప్పటికీ మానసికంగా కలిసే ఉంటామని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను కూడా పెళ్లి తర్వాత వేర్వేరుగా ఉంటున్నామని.. అయితే మెయిన్ ఈవెంట్స్, ఫంక్షన్స్ సమయంలో మాత్రం కలుసుకుంటూనే ఉంటామని అన్నారు. దీంతో వరుణ్ తేజ్ పెళ్లి విషయంపై మరోసారి నెట్టింట చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.