Andrudu: ‘ఆంధ్రుడు’ హీరోయిన్ ఎంతగా మారిపోయిందో చూశారా ?.. ఇప్పటికీ గౌరీ ఓ అందమైన మయూరమే..

2005లో పరుచూరి మురళి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు గౌరీ. ఇందులో విలక్షణ హీరో.. మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా కనిపించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Andrudu: 'ఆంధ్రుడు' హీరోయిన్ ఎంతగా మారిపోయిందో చూశారా ?.. ఇప్పటికీ గౌరీ ఓ అందమైన మయూరమే..
Gouri Pandit
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 8:30 PM

చిత్రపరిశ్రమలో హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుని.. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన తారలు చాలా మంది ఉన్నారు. అంధం, అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. ఆ తర్వాత అదృష్టం కలిసిరాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో గౌరీ పండిట్ ఒకరు. 2005లో పరుచూరి మురళి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు గౌరీ. ఇందులో విలక్షణ హీరో.. మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా కనిపించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్కసారిగా హీరోయిన్‏గా ఆకర్షించింది గౌరీ. అల్లరి, దుఃఖం అన్నింట్లో గౌరీ నటనతో మెప్పించింది.

అయితే ఆంధ్రుడు సినిమా తర్వాత గౌరీ పలు చిత్రాల్లో నటించింది. కానీ అవేవి ఆమెకు ఈ సినిమా తెచ్చినంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయాయి. తెలుగుతోపాటు.. హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్నారు గౌరీ పండిట్. వీరికి ఓ బాబు ఉన్నారు.

Gourie Pandit

Gourie Pandit

ఆమె చివరగా బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ చిత్రంలో నటించింది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు గౌరీ. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.