Tollywood: ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా.. ఇప్పుడెం చేస్తుందో తెలుసా?
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాను..
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘నిన్ను చూడాలని’. ఈ సినిమాను దర్శకుడు వి.ఆర్. ప్రతాప్ తెరకెక్కించగా.. రవీనా రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. హీరోగా తెలుగు తెరకు ఎన్టీఆర్ అరంగేట్రం చేసింది ఈ చిత్రంతోనే.. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితేనేం ఎన్టీఆర్ మాత్రం ఆ తర్వాత పలు చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కించుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నటించిన రవీనా రాజ్‌పుత్.. ఆ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు. అటు ఈ చిత్రానికి కంటే ముందు వెంకటేష్ హీరోగా నటించిన ‘ఒంటరి పోరాటం’లో కీలక పాత్ర చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ‘నిన్ను చూడాలని’తో సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిన రవీనా రాజ్‌పుత్.. హిందీ, తమిళం, కన్నడంలోనూ ఎలాంటి చిత్రాలు నటించలేదు.
కాగా, ‘నిన్న చూడాలని’ డిజాస్టర్‌తో ఈ బ్యూటీ పూర్తిగా సినీ పరిశ్రమపై ఆసక్తి లేని కారణంగా దూరమైందని తెలుస్తోంది. ఆ తర్వాత ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెట్ అయిందట.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం