Vijay Thalapathy: విజయ్ దళపతి.. లోకేష్ కనగరాజ్ చిత్రంలో కేజీఎఫ్ స్టార్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..

మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్,

Vijay Thalapathy: విజయ్ దళపతి.. లోకేష్ కనగరాజ్ చిత్రంలో కేజీఎఫ్ స్టార్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..
Thalapathy67
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 6:22 PM

ఇటీవల వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తమిళ్ స్టార్ విజయ్ దళపతి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తమిళంతోపాటు.. తెలుగులో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు దళపతి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిన్న అధికారికంగా అనౌన్స్ చేశారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్, ప్రియా ఆనంద్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. “దళపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్‌గా వుంది’’ అన్నారు సంజయ్ దత్

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా భాగం కానుంది. “దలపతి67లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను! ” అన్నారు ప్రియా ఆనంద్. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతోచార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.