Meenakshi Chaudhary: ‘జీవితంలో ఎన్నో భావోద్వేగాలు.. అన్ని సమయాల్లో తోడుగా ఉంది’.. మీనాక్షి చౌదరి ఆసక్తికర పోస్ట్..
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మీనాక్షి.. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న మీనాక్షి.. కెరీర్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. ఇటీవలే హిట్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది.

ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ఆమె తర్వాత ప్రధానంగ ఇండస్ట్రీలో మారుమోగుతోన్న పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మీనాక్షి.. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న మీనాక్షి.. కెరీర్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. ఇటీవలే హిట్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది. నిజానికి ఈ చిత్రంలో పూజా హెగ్డే నటించాల్సింది. కానీ అనుహ్యంగా పూజా తప్పుకోవడంతో ఈ ఆఫర్ మీనాక్షికి చేరింది. ఈ మూవీతోపాటు తెలుగులో మరిన్న అవకాశాలు అందుకుంటునట్లుగా సమాచారం. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మీనాక్షి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది మీనాక్షి.
నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇప్పుడు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కష్టం.. లేదా సుఖం… పరిస్థితి ఏదైనా చిరునవ్వుతో ముందుగా సాగాలని.. అన్నింటిని ఎదుర్కొవాలని ఇన్ స్టాలో రాసుకోచ్చారు మీనాక్షి. “మీనాక్షిలో అనేక రకాల షేడ్స్ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడూ ఎన్నో భావోద్వేగాలు , జీవితంలోని అనేక దశలతో లైఫ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. ఇలాంటి దశలను ఇంతముందు అనుభూతి చెందలేదు. జీవితంలో చాలాసార్లు నేను పడిపోయాను, ప్రయత్నించాను, మళ్లీ లేచాను. ఇలా నా జీవితం సాగింది. ఆ తర్వాత నేను ఆత్మపరిశీలన చేసుకోవడం, జీవితాన్ని చూసే విధానం నేర్చుకున్నాను. అంతకుముందు అది ఏంటీ అనేది నేను గ్రహించలే. కానీ ఆ అనుభవం మాత్రం జీవితాన్ని మార్చింది. ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉంది నా చిరునవ్వు. కాలంతో పాటు ప్రతిదీ మారుతుందనే విషయాన్ని నాకు అర్థమయ్యేలా చేసింది. కాబట్టి, ప్రస్తుతం మీ జీవితంలోని ఏ దశలోనైనా మంచి లేదా చెడు, అన్ని పరిస్థితుల్లోనూ చిరునవ్వు తెప్పించిన క్షణాలను గుర్తుచేసుకోండి” అంటూ రాసుకొచ్చింది మీనాక్షి.
View this post on Instagram
1996లో మార్చి 5న హర్యానాలో జన్మించింది మీనాక్షి. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది. 2018లో అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతోపాటు.. వరుణ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.