AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mazaka Movie Review: మజాకా మూవీ రివ్యూ.. సందీప్ కిషన్, రావు రమేశ్‌ల సినిమా ఎలా ఉందంటే?

సందీప్ కిషన్, రావు రమేశ్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించారు. అలాగే మన్మథుడు హీరోయిన్ అన్షు ఈ సినిమాతోనే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. టీజర్స్, ట్రైలర్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి.

Mazaka Movie Review: మజాకా మూవీ రివ్యూ.. సందీప్ కిషన్, రావు రమేశ్‌ల సినిమా ఎలా ఉందంటే?
Mazaka Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Basha Shek|

Updated on: Feb 26, 2025 | 3:05 PM

Share

మూవీ రివ్యూ: మజాకా

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అన్షు అంబానీ, అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది తదితరులు

సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

సినిమా చూపిస్త మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా లాంటి హిట్ సినిమాల తర్వాత త్రినాధరావు, ప్రసన్నకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మజాకా. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

వెంకటరమణ (రావు రమేష్) కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) పుట్టగానే భార్య దూరమవుతుంది. దాంతో అన్ని తానే అయి కొడుకుని పెంచుతాడు. ఇంట్లో ఆడదిక్కు ఉండదు కాబట్టి కొడుక్కి పెళ్లి చేస్తే కోడలునే కూతురులా చూసుకోవాలి అనుకుంటాడు రమణ. కానీ ఆడ దిక్కు లేని సంసారం కదా..? ఇద్దరు మగవాళ్ళు ఉన్న ఇంటికి పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. అందుకే ముందు తానే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు రమణ. ఈ క్రమంలోనే యశోద (అన్షు అంబానీ)ని చూసి ప్రేమలో పడతాడు. అదే సమయంలో తన కాలేజీలోనే చదివే మీరా (రీతూ వర్మ)తో ప్రేమలో పడతాడు కృష్ణ. సరిగ్గా ఇదే సమయంలో ఈ తండ్రి కొడుకుల జీవితంలోకి వస్తాడు బిజినెస్ మాన్ భార్గవ్ వర్మ (మురళీ కృష్ణ). వాళ్ళిద్దరు పెళ్లి జరగాలంటే తాను చెప్పిన కండిషన్ కు ఒప్పుకోవాలి అంటాడు భార్గవ వర్మ. అసలు ఈ తండ్రి కొడుకులకు బిజినెస్ మాన్ కు ఉన్న లింక్ ఏంటి.. వాళ్ళిద్దరు పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

టైం బాగున్నపుడు రొట్ట సినిమా కూడా గొప్ప సినిమాలా కనిపిస్తుంది. అలాగని నేను రాసిందే సీన్.. తీసిందే సినిమా అంటే ఎలా..? వర్కవుట్ అయితే ధమాకానే.. సీన్ సితార అయితే సినిమా మజాకా అవుతుంది. ఎంత కన్వీనియెంట్ గా కథ రాసుకున్నారు అంటే.. ఇక్కడ ఓ పాట రావాలంటే వచ్చేస్తుంది.. ఓ ఎమోషనల్ సీన్ పడాలి అంటే పడుతుంది. కామెడీ సీన్ వచ్చి చాలా సేపైంది.. ఓ కామెడీ బిట్ పడాలి.. ఇలా ఏది అనుకుంటే అది రాశారు. తీస్తుంది రొటీన్ కథ అని తెలిసినప్పుడు.. స్క్రీన్ ప్లేలో కాస్తైనా మ్యాజిక్ ఉండాలి.. మ్యాజిక్ పక్కన పెడితే.. అసలు స్క్రీన్ మీద ఏం చూస్తున్నామో అర్థం కాలేదు కాసేపు. పాట ఎందుకొస్తుందో తెలియదు.. ఎమోషన్ ఏంటో అర్థం కాదు.. కామెడీకి నవ్వు రాదు.. ఫస్ట్ హాఫ్ కొంతైనా బెటర్.. ఒకటో రెండో జోకులు పేలాయి.. సెకండ్ హాఫ్ అమ్మో..! అన్నీ కలిసొచ్చినపుడు ఇలాంటి కథలతోనే హిట్ కొట్టారు ప్రసన్న కుమార్, త్రినాధరావు నక్కిన. కానీ ఈసారి మాత్రం వాళ్ళ ప్లాన్ వర్కవుట్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ లో తండ్రి కొడుకుల లవ్ సీన్స్ తో సినిమా కొంతైనా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చెప్పడానికి ఏమీ లేదు. దాంతో కథ అక్కడక్కడే తిరుగుతుంది. దానికి తోడు హైపర్ ఆది జబర్దస్త్ జోకులు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అన్నింటికి మించి ఒకటే సీన్ ఇటు తండ్రితో.. పాటు కొడుకుతో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేసరికి చూడడానికి అసలు ఆసక్తికరంగా అనిపించదు. ఏదో లాజిక్స్ అన్ని పక్కన పెట్టి టైం పాస్ కోసం వెళితే కాస్త ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

సందీప్ కిషన్ ఎప్పటిలాగే స్క్రీన్ మీద చాలా ఎనర్జీతో కనిపించాడు. డాన్సులు ఫైట్లు కామెడీ అంతా బాగానే చేశాడు కానీ కథ సహకరించలేదు. రావు రమేష్ తో చేయించిన కొన్ని సీన్స్ కు నవ్వాలా.. ఏడవాలో తెలియదు. అంత మంచి నటుడితో.. కామెడీ పేరుతో ఏంటి ఈ సీన్స్ అనిపించింది. అయినా కూడా ఆయన వరకు అద్భుతంగా చేశాడు రావు రమేష్. రీతు వర్మ, మన్మధుడు ఫేమ్ అన్షు ఉన్నారంటే ఉన్నారు. హైపర్ ఆది, అజయ్ పర్లేదు. మురళి శర్మకు టిపికల్ క్యారెక్టర్ ఇవ్వాలని చూశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు.

టెక్నికల్ టీం:

లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పర్లేదు. పాటలు ఓకే అనిపిస్తాయి.. రీ రికార్డింగ్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. త్రినాధరావు, ప్రసన్న మ్యాజిక్ ఈసారి పని చేయడం అనుమానమే. ఒకే కథని ఎన్నిసార్లు తీయడం వాళ్లకు కూడా కత్తి మీద సామే. ప్రతిసారి వర్కౌట్ అవ్వాలని లేదు కదా.

పంచ్ లైన్:

ఓవరాల్ గా మజాకా.. నో స్టోరీ.. నో లాజిక్.. పరమ రొటీన్..!

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు