Tollywood: 22 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఎవరో గుర్తుపట్టారా..?
దాదాపు 22 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సంచలనం. తొలి సినిమాతోనే అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. తెలుగులో మూడు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.
సినీరంగంలో ఒకప్పుడు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును కట్టిపడేశారు. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతారు అనుకున్న సమయంలోనే ఊహించని విధంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. మొదటి సినిమాతోనే యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ సైతం రిలీజ్ అయ్యింది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. అన్షు అంబానీ. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ మన్మథుడు సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మన్మథుడు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపించి అప్పటి యువతను మెప్పించింది అన్షు అంబానీ. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో కథానాయికగా నటించింది. రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది.
కొన్నిరోజులుగా వరుస ఇంటర్వ్యూలు, టీవీ షోలలో కనిపించిన అన్షు.. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న మజాకా చిత్రంలో నటిస్తుంది. ఈరోజు ఈ సినిమా నుంచి అన్షు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో అన్షు పెళ్లి కూతురు గెటప్ లో చేతిలో తాళి, కొబ్బరిబోండం పట్టుకుని కనిపిస్తుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ నటిస్తున్నారు. అయితే ఇందులో అన్షు రావు రమేశ్ జోడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ నవ్వులు పూయిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..