AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ జోడీగా మలయాళీ బ్యూటీ.. ఈ సూపర్ హిట్ సీక్వెల్‏లో మంజు వారియర్..

ఇటీవలే జవాన్ సినిమాతో నార్త్ అభిమానులకు దగ్గరయ్యారు విజయ్. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అటు బీటౌన్‏లో ఇప్పుడు బిజీ స్టార్ అయ్యారు. ఇవే కాకుండా ఇటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సీక్వెల్ చేసేందుకు రెడీ అయ్యారట. డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో విడుదలై పార్ట్ 1 ఒకటి. 1980ల నాటి పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో హస్య నటుడు సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు.

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ జోడీగా మలయాళీ బ్యూటీ.. ఈ సూపర్ హిట్ సీక్వెల్‏లో మంజు వారియర్..
Vijay Sethupathi, Manju Warrier
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2023 | 2:46 PM

Share

ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ సేతుపతి. తమిళ్, తెలుగు, హిందీ అన్ని భాషల్లోనూ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే జవాన్ సినిమాతో నార్త్ అభిమానులకు దగ్గరయ్యారు విజయ్. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అటు బీటౌన్‏లో ఇప్పుడు బిజీ స్టార్ అయ్యారు. ఇవే కాకుండా ఇటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సీక్వెల్ చేసేందుకు రెడీ అయ్యారట. డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో విడుదలై పార్ట్ 1 ఒకటి. 1980ల నాటి పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో హస్య నటుడు సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రం అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇందులో విజయ్ సేతుపతి భార్యగా మలయాళీ బ్యూటీ మంజు వారియర్ నటించనుందట. బజ్ ప్రకారం రెండవ భాగంలో విజయ్ సేతుపతి పాత్ర పెరుమాళ్ వాతియార్, అతను తిరుగుబాటు నాయకుడిగా ఎలా మారాడు అనేది చూపించనున్నారు. కథలో ముఖ్యమైన భాగం 1960ల నేపథ్యంలో సాగుతుందని, ముఖ్యంగా విజయ్ సేతుపతి, మంజు వారియర్‌లతో సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది . ఈ చిత్రంలో సూరి, ప్రకాష్ రాజ్ , భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు, ఇంకా పలువురు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ వేల్‌రాజ్‌ నిర్వహించారు. ఈ చిత్రం 2024 సమ్మర్‌లో విడుదల కానుంది.

విజయ్ సేతుపతి చివరిసారిగా అట్లీ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జవాన్‌లో కనిపించారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ , నయనతార, ప్రియమణి , సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆయన శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇందులో కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా జనవరి 12, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక మంజు.. మను ఆనంద్ రూపొందించనున్న తమిళ చిత్రం మిస్టర్ ఎక్స్‌లో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.