AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagachaitanya: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన నాగచైతన్య.. పేరెంటో తెలుసా ?..

సినిమా అప్డేట్స్ నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నింటి గురించి తెలుసుకుంటున్నారు. ఇక సినీతారలు సైతం తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లకు, దర్శకులు ఫ్యాన్స్ ఇన్ స్టా వేదికగా సినీ ప్రియులకు దగ్గరవుతున్నారు. ఇక మరికొందరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తమ సినిమాలను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు హీరో నాగచైతన్య సైతం ఆ జాబితాలోకి చేరిపోయారు.

Akkineni Nagachaitanya: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన నాగచైతన్య.. పేరెంటో తెలుసా ?..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2023 | 2:48 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సెలబ్రేటీలకు, అభిమానులకు మధ్య వారధిగా మారింది. ఇన్ స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాలలో తమ అభిమాన తారలతో నేరుగా ముచ్చటిస్తున్నారు. సినిమా అప్డేట్స్ నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నింటి గురించి తెలుసుకుంటున్నారు. ఇక సినీతారలు సైతం తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లకు, దర్శకులు ఫ్యాన్స్ ఇన్ స్టా వేదికగా సినీ ప్రియులకు దగ్గరవుతున్నారు. ఇక మరికొందరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తమ సినిమాలను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు హీరో నాగచైతన్య సైతం ఆ జాబితాలోకి చేరిపోయారు. ఇప్పుడు చైతూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఇంతకీ ఆ ఛానల్ పేరెంటీ అనుకుంటున్నారా ?.. ‘అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)’. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు అందులో ఓ వ్యక్తి ప్రశ్నించగా.. చైతూ సమాధానం చెబుతూ కనిపించారు.

‘చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు. కారమేంటో తెలుసుకోవచ్చా ?.. అని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. వేరే పనేం లేక జుట్టు, గడ్డం పెంచాను.. అంటూ ఆన్సర్ ఇచ్చారు చైతూ.’ అలాగే ప్రస్తుతం ఆయన హీరోగా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న #NC23 సినిమా కోసం పెంచినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫోటోషూట్ జరిగిందని.. ఔట్ పుట్ బాగా వచ్చిందని తెలిపారు.

ఇక తర్వాత త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న తన తొలి వెబ్ సిరీస్ ధూత గురించి మాట్లాడుతూ.. ధూత ఎవరో తెలియాలంటే సోషల్ మీడియాలో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఖాతాను ట్యాగ్ చేసి అడిగితే ఆన్సర్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం చైతూ , చందూ మొండేటీ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంది. మత్య్సకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం చైతూ పూర్తిగా తన స్టైల్ మార్చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ కాబోతుంది.

Follow Us
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా