AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో మైండ్ బ్లాంక్.. కట్ చేస్తే..

పెళ్లి తర్వాత తొలిరాత్రి గదిలోకి అడుగుపెట్టే ఏ భర్తకైనా ఎన్నో మధురమైన ఊహలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ వరుడికి ఎదురైన అనుభవం మాత్రం ఎవరూ ఊహించనిది. గదిలోకి వెళ్లగానే ఆ వధువు ఒక వింత కండిషన్ పెట్టింది. ఆ కండీషన్ ఏంటీ..? ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో మైండ్ బ్లాంక్.. కట్ చేస్తే..
Bride Demands Rs 90 Lakhs From Groom
Krishna S
|

Updated on: Apr 14, 2026 | 8:10 AM

Share

పెళ్లి అంటే రెండు మనసుల కలయిక, ఎన్నో ఆశలతో మొదలయ్యే కొత్త జీవితం. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక వివాహం మాత్రం ఊహించని మలుపు తిరిగింది. తనను ముట్టుకోవాలంటే లక్షల్లో నగదు ఇవ్వాలంటూ ఒక వధువు ఏకంగా తన భర్తకే కండిషన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా జగదీష్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఘనంగా వివాహం ముగిసిన తర్వాత వధువు వరుడి ఇంటికి చేరుకుంది. శోభనం రాత్రి వరుడు ఆశగా గదిలోకి ప్రవేశించగా, వధువు పెట్టిన కండిషన్ విని అతడికి మైండ్ బ్లాక్ అయ్యింది. తనతో కలవాలంటే వెంటనే 90 లక్షల రూపాయల నగదు చెల్లించాలని ఆమె పట్టుబట్టింది. అంత భారీ మొత్తం ఇస్తేనే ఈ పెళ్లికి గుర్తింపు ఉంటుందని, లేదంటే తనను తాకనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంది.

రణరంగంగా మారిన ఇల్లు

డబ్బు విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ కాస్తా పెద్దదై బయటకు పొక్కింది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా వధువు తన తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వారు వచ్చాక మరింత రచ్చ మొదలుపెట్టింది. ఇంట్లోని వస్తువులను పగలగొట్టడమే కాకుండా ఏకంగా గ్యాస్ పైప్‌లైన్‌ను లాగి పారేసి, అందరినీ చంపేస్తానంటూ వీరంగం సృష్టించినట్లు వరుడి కుటుంబం ఆరోపిస్తోంది.

నగలతో పరార్.. కోర్టులో తేలనున్న పంచాయితీ

వధువు అసలు ఉద్దేశం పెళ్లి చేసుకోవడం కాదు, కేవలం డబ్బులు వసూలు చేయడమేనని వరుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. గొడవ ముదిరిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారు నగలు, అత్తగారు పెట్టిన ఆభరణాలతో ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకాడటంతో, బాధితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. పెళ్లి పేరుతో సాగుతున్న ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Follow Us
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్లిన వరుడు.. వధువు పెట్టిన కండీషన్‌తో
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో చరిత్ర.. ఎవరీ సాకిబ్ హుస్సేన్ ?
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
బరువు తగ్గాలనుకుంటున్నారా?ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..