Mohan Babu: పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై స్పందించిన మోహన్ బాబు… తన మార్క్ చూపించారు

రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ వర్గాలు పవన్‌పై కౌంటర్ అటాక్ షురూ చేశాయి.

Mohan Babu: పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై స్పందించిన మోహన్ బాబు... తన మార్క్ చూపించారు
Mohan Babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 26, 2021 | 5:26 PM

రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ వర్గాలు పవన్‌పై కౌంటర్ అటాక్ షురూ చేశాయి. మరోవైపు తనకు మద్దతుగా నిలవడంపై పవర్ స్టార్‌కు హీరో నాని థ్యాంక్స్ చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలు త్వరగా పరిష్కారించాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్‌ వేదికగా కోరారు. ఇక వైసీపీ మద్దతుదారుడైన సీనియర్ నటుడు మోహన్ బాబుకి పవన్ కళ్యాణ్  చురకలు అంటించిన విషయం తెలిసిందే. “సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే ఆన్లైన్ లో భర్తీ చేస్తుంది.. అది మీకు సమ్మతమేనా” అని పవన్, మోహన్ బాబును ప్రశ్నించారు. పవన్ కామెంట్స్‌పై తాజాగా మోహన్ బాబు రెస్పాండ్ అయ్యారు. మై డియర్ పవన్ కళ్యాణ్ అంటూ ఓ లేఖ విడుదల చేశారు.

“నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కళ్యాణ్.. నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకే ఏకవచనంతో సంభోదించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలాకాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10వ  తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని… నీ అమూల్యమైన ఓటుని నీ సోదరసమానుడైన విష్ణు బాబుకి.. అతడి ఫ్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్”  అని మోహన్ బాబు పేర్కొన్నారు.

Also Read: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. జీప్‌లో భారీ గూడు కట్టిన తేనెటీగలు

తుఫాను వేళ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు.. చేయాల్సినవి, చేయకూడనివి