Manchu Manoj: చీకట్లో కనిపించిన వెలుతురే మౌనిక.. మంచు మనోజ్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న భార్య

తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్​లో కలెక్షన్‌ కింగ్‌ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్- మౌనిక దంపతులు సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.

Manchu Manoj: చీకట్లో కనిపించిన వెలుతురే మౌనిక.. మంచు మనోజ్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న భార్య
Manchu Manoj, Mounika
Follow us

|

Updated on: Mar 22, 2023 | 5:52 PM

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, కర్నూలుకు చెందిన మౌనికా రెడ్డి ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నాల్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇటీవల పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో మనోజ్‌, మౌనికల వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, టాలీవుడ్‌ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా ఇటీవల మోహన్‌బాబు 71వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్​లో కలెక్షన్‌ కింగ్‌ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్– మౌనిక దంపతులు సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ‘జీవితంలో గెలుపోటములు సహజం.. మనం చేసే ప్రయాణాన్ని అనుభూతి చెందాలి. అందరి జీవితాల్లో ఒక ఫేజ్ వస్తుందని.. గాఢాంధకారంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు.. ముందుకు సాగాలి. నా లైఫ్‌లోనూ ఇలాంటి ఓ గడ్డు పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడింది. ఎక్కువగా పాటలు రాసుకుంటూ, మ్యూజిక్ కంపోజ్ చేస్తూ గడిపాను’

‘నేను సినిమా చేసి సుమారు ఆరేళ్లు అవుతోంది. అయినా ప్రేక్షకులు మాత్రం ప్రేమ తగ్గించకుండా ఇస్తున్నారు. ఎన్ని జన్మలు ఎత్తితే ఇది దక్కుతుంది? నేను చీకట్లో ఉన్నప్పుడు ముందుకు వెళ్దామని అనుకుంటున్న టైమ్​లో ఓ వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అప్పుడే నాకు అర్థమైంది ఏది దూరం పెట్టానో. నాకు సినిమాలు, సామాజిక సేవ అంటే ఇష్టం. అందుకే మళ్లీ సినిమాలు చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి. తను ఏం చేయాలనుకున్నా నేను తోడుగా ఉంటా. ప్రతి ఆడదాని గెలుపు వెనకాల ఓ మగాడు ఉండాలి. . ఆడవాళ్లు గెలిస్తేనే మనం గెలిచినట్లు’ అని ఎమోషనల్‌ అయ్యాడు మనోజ్‌. ఈ వ్యాఖ్యలు విని అక్కడే ఉన్న మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..