Tirumala Laddu: హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తారా? తిరుమల లడ్డూ కల్తీపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు

Tirumala Laddu: హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తారా? తిరుమల లడ్డూ కల్తీపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్
Tirumala Laddu
Follow us

|

Updated on: Sep 22, 2024 | 3:46 PM

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. పవిత్రమైన ప్రసదంలో జంతువుల కొవ్వును వాడడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి కారకులైన బాధ్యులను గుర్తించి.. వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి ఎంతో బాధేసింది. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు. భక్తుల మనోభావాలను అవమానించడం, అగౌరవపరచడం. ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి. బాధ్యులను గుర్తించాలి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. సంస్కృతి, మతపరమైన విలువలను అందరూ గౌరవించాలి. సంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమనడానికి ఇదొక మంచి ఉదాహరణ కావాలి’ అని మనోజ్‌ పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై మరో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందించారు. ఇలాంటి ప‌నిని చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అమిత్‌షాలను కోరారు.

మంచు మనోజ్ ట్వీట్..

‘గ‌త కొన్నేళ్లుగా తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదంలో టాంప‌రింగ్ జ‌రిగింద‌ని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి.” అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను ట్యాగ్ చేశారు హీరో నిఖిల్.

హీరో నిఖిల్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.