Sarkaru Vaari Paata : స్పీడ్ పెంచనున్న సర్కారు వారిపాట టీమ్.. వచ్చే నెలలో మళ్లీ సెట్స్ పైకి మూవీ..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తుంది. హీరో తండ్రి ఒక బ్యాంక్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్‌మేన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. దాంతో రంగంలోకి దిగిన హీరో.. ఆ బిజినెస్‌మేన్ తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అంటూ ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. అలాగే అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందట.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే శరవేగంగా జరుగుతున్న షూటింగ్ .. మహేశ్ బాబు మోకాలు సర్జరీ కారణంగా గత కొంతకాలంగా వాయిదా పడింది. మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సినిమాను తిరిగి ఫిబ్రవరిలో మొదలు పెట్టాలనుకున్నారు. కానీ జనవరి నుంచి మొదలుపెట్టేద్దాం అని మహేశ్ నిర్మాతలతో తాజాగా అన్నట్టు తెలుస్తోంది. దాంతో వచ్చే నెలనుంచి మహేష్ తిరిగి సెట్ లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తుంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపి సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయనున్నారట. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమాను ముందుగా సంక్రాంతికానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తోపాటు మరి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. ఏప్రిల్ 1 న సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :