Sarkaru Vaari Paata: మహేష్ సినిమాకు అనుకోని అడ్డంకులు.. సమ్మర్‌కు రిలీజ్ సాధ్యమేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారు పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారు పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు అనుకుకొని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తున్ననేపథ్యంలో మహేష్ మోకాలి సర్జరీ కావడంతోబ్రేక్ పడింది. సర్జరీ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో కొద్దిరోజుల్లోనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతారు అనుకునేలోగా.. మహేష్ బాబు కరోనా బారిన పడటంతో షూటింగ్ వెనక్కి వెళ్ళింది. అయినా పర్లేదు మహేష్ త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగ్ మొదలు పెడతారు అని అంతా భావించారు. కానీ ఇంతలోనే మహేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
మహేష్ బాబు అన్న రమేష్ బాబు అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా కన్నుమూశారు. మహేష్ బాబు ఆయన అన్నయ అంటే చాలా ఇష్టం పలు సందర్భాల్లో మహేష్ ఈ విషయాన్ని పంచుకున్నారు కూడా.. కానీ ఇపుడు అన్నయ్యను కడసారి చూసేందుకు కూడా మహేష్ నోచుకోలేని పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు చేసిన ఎమోషనల్ పోస్ట్ చూస్తే ఆయనకు తన అన్న అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. దాంతో మహేష్ సినిమా షూటింగ్ లో ఇప్పట్లో పాల్గొనడం కష్టం అని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నయ పోయిన భాదనుంచి మహేష్ బయటపడటానికి కాస్త సమయం పడుతుందని తెలుస్తుంది. దాంతో సర్కారు వారి పాట మూవీ షూటింగ్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక సంక్రాంతికి మహేష్ బాబు సినిమానుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేనట్టే అని తెలుస్తుంది. ఇంతటి విషాదంలో మహేష్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు అని మహేష్ అభిమానులు అంటున్నారు. అలాగే సినిమాకూడా ఏప్రిల్ 1న థియేటర్లకు రాకపోవచ్చని చెప్పుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :