Aadi Saikumar: కలెక్షన్స్ బాగున్నాయి.. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన ఆదిసాయికుమార్..

ఆది సాయి కుమార్ , నువేక్ష జంటగా న‌టించిన చిత్రం అతిథి దేవో భవ. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్ ద‌ర్శ‌కత్వం వహించగా..

Aadi Saikumar: కలెక్షన్స్ బాగున్నాయి.. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన ఆదిసాయికుమార్..
Aadi Sai Kumar
Follow us

|

Updated on: Jan 10, 2022 | 4:05 PM

ఆది సాయి కుమార్ , నువేక్ష జంటగా న‌టించిన చిత్రం అతిథి దేవో భవ. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్ ద‌ర్శ‌కత్వం వహించగా.. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌లై ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ ఆదివారంనాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచి బాగుంద‌ని చాలా ఫోన్లు వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎప్ప‌డు ఆద‌రిస్తారు. క‌లెక్ష‌న్లు కూడా బాగున్నాయంటున్నారు. వైజాగ్ ,సీడెడ్ ల‌లో క‌లెక్ష‌న్లు చాలా బాగున్నాయ‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఇక నా పెర్ ఫార్మెన్స్‌కూ హీరోయిన్ న‌ట‌న‌కు అప్లాజ్ వ‌స్తోంది. పాట‌లు కూడా మంచి ఆద‌ర‌ణ పొందాయి. నా త‌ల్లిగా న‌టించిన రోహిణికీ, నా మ‌ధ్య వున్న స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్ వున్నాయ‌ని తెలియ‌జేస్తున్నారు. ఇక సప్త‌గిరి కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మ‌రో స్థాయిలో వుంది. ఎక్క‌డా వినోదం మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు తీశాడు. యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్‌గా వుంద‌ని టాక్ వ‌స్తోంది. బ‌య‌ట కోవిడ్ వంటి వాతావ‌ర‌ణ వున్నా ఇంత ఆద‌ర‌ణ పొంద‌డం ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా ఇంకా చూడ‌నివారుంటే చూసి ఆనందించండి అని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ తెలుపుతూ, తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను ఇంత‌లా ఆద‌రిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. అన్ని ఏరియాల‌నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. వైజాగ్‌, సీడె్డ్‌ల‌లో హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌లో ర‌న్ అవుతోంది. మిగిలీఇన చోట్ల బాగుంద‌నే టాక్ వుంది. సినిమా ఫ‌స్టాఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో వుంటూ సెకండాఫ్ మంచి ఎమోష‌న్స్ పండాయ‌ని ప్రేక్ష‌కులు తీర్పు ఇచ్చారు. ఇక స‌ప్త‌గిరి పాత్ర హైలైట్‌గా నిలిచింది. హీరో హీరోయిన్ల‌తోపాటు రోహిణిగారి పాత్ర సాంకేతిక సిబ్బంది పనిత‌నం అంద‌రూ మెచ్చుకుంటున్నార‌ని తెలిపారు.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..