Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!

సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్ల గ్రాస్ క్రాస్ అయ్యింది. రూ.300 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతోంది. మొత్తానికి వెంకీతో కలిసి అనిల్ రావిపూడి (Anil Ravipudi) కొత్త చరిత్రకు తెరతీసారు. అయితే ఇంతపెద్ద విజయానికి కారణం మాత్రం మహేష్ బాబు అంటున్నాడు. మరి సంక్రాంతికి వస్తున్నాం మూవీరి మహేష్ బాబుకి సంబంధం ఏంటి..?

Mahesh Babu: మహేష్ బాబు చెప్పాడు.. అనిల్ రావిపూడి పాటించాడు..!
Mahesh Babu, Anil Ravipudi
Follow us
Praveen Vadla

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 28, 2025 | 6:40 PM

అరుణాచలంలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..! దేవుడు శాసించాడు అరుణాచలం పాటించాడు అని.. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇంచుమించూ ఇదే చేసాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈయన రేంజ్ మామూలుగా పెరగలేదు. ఒక్కసారిగా స్టార్ కాదు.. టాప్ డైరెక్టర్ అయిపోయాడు. నిన్నటి వరకు అనిల్ రావిపూడి అంటే క్రేజీ డైరెక్టర్.. ఆయనతో సినిమా చేస్తే కనీసం యావరేజ్ గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ హిట్స్ కొట్టే సత్తా కూడా ఈ దర్శకుడిలో ఉందని నిరూపించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. కథ చూస్తే మామూలుగానే ఉంది కానీ కలెక్షన్లు మాత్రం అలా లేవు.

ఏ పెద్ద సినిమాలకు, విజువల్ వండర్స్‌కు, పాన్ ఇండియన్ సినిమాలకు తీసిపోని విధంగా ఈ సినిమా వసూళ్లు వచ్చాయి. మొదటి వారంలోనే చాలా వరకు నాన్ రాజమౌళి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది సంక్రాంతికి వస్తున్నాం. నిజానికి ఈ స్థాయి విజయాన్ని వాళ్లు కూడా ఊహించలేదు. జస్ట్ 72 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఆర్నెళ్లలో ఈ సినిమాను విడుదల చేసాడు అనిల్. ఫస్ట్ డే నుంచే వేట మొదలుపెట్టాడు వెంకీ మామ. కేవలం 14 రోజుల్లోనే 140 కోట్ల షేర్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం. రెండు వారాల్లోనే 140 కోట్ల షేర్.. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ సినిమా పవర్ మరోసారి చూపించింది ఈ సినిమా.

ఈ దూకుడు చూస్తుంటే రూ.300 కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మొత్తానికి వెంకీతో కలిసి అనిల్ రావిపూడి కొత్త చరిత్రకు తెరతీసారు. అయితే ఇంతపెద్ద విజయానికి కారణం మాత్రం మహేష్ బాబు అంటున్నాడు. జైలర్ చూసిన తర్వాత అనిల్ రావిపూడిని కలిసి నువ్వెందుకు క్రైమ్ కామెడీ ట్రై చేయకూడదు అని సలహా ఇచ్చారని.. అప్పుడే తనకు ఈ ఐడియా వచ్చిందని చెప్పాడు అనిల్ రావిపూడి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ వెనక మహేష్ పాత్ర కూడా ఉందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

చాణక్యుడి హెచ్చరిక: ఈ ప్రదేశాల్లో ఉంటే కష్టాలు తప్పవు..!
చాణక్యుడి హెచ్చరిక: ఈ ప్రదేశాల్లో ఉంటే కష్టాలు తప్పవు..!
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న దుండగులు
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న దుండగులు
రోజుకు రెండు యాలకులు తింటే చాలు..ఇలాంటి వ్యాధులకుమంత్రం వేసినట్టే
రోజుకు రెండు యాలకులు తింటే చాలు..ఇలాంటి వ్యాధులకుమంత్రం వేసినట్టే
అప్పట్లో కాల్‌ సెంటర్‌లో పని చేసింది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్..
అప్పట్లో కాల్‌ సెంటర్‌లో పని చేసింది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్..
రాబడి విషయంలో ఆ పథకాలే బెస్ట్.. ప్రధాన తేడాలు తెలిస్తే షాక్..!
రాబడి విషయంలో ఆ పథకాలే బెస్ట్.. ప్రధాన తేడాలు తెలిస్తే షాక్..!
పర్సనల్ లోన్స్.. తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
పర్సనల్ లోన్స్.. తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
వైభవంగా సాగుతున్న సమతాకుంభ్ ..తొమ్మిదో రోజు ప్రత్యేకతలు
వైభవంగా సాగుతున్న సమతాకుంభ్ ..తొమ్మిదో రోజు ప్రత్యేకతలు
ఆ మైనర్ల మధ్య వాట్సాప్ చాటింగ్.. కట్ చేస్తే..
ఆ మైనర్ల మధ్య వాట్సాప్ చాటింగ్.. కట్ చేస్తే..
ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? నష్టమే
ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగినప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? నష్టమే
బూతులు మాట్లాడటానికి లైసెన్స్ ఉందా.? రణ్‌వీర్‌పై సుప్రీం ఆగ్రహం
బూతులు మాట్లాడటానికి లైసెన్స్ ఉందా.? రణ్‌వీర్‌పై సుప్రీం ఆగ్రహం