Jaat Movie: జాట్ దెబ్బకు రికార్డులన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయిగా..!
బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోని సింగిల్ స్క్రీన్స్‌కు మన సలార్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలతోనే కళ వచ్చింది. పైగా బాలీవుడ్‌కు మాస్‌ను కొత్తగా పరిచయం చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్లూ అక్కడ కూడా మాస్ సినిమాలు వచ్చాయి.. యాక్షన్ సినిమాలు వాళ్లు కూడా తెరకెక్కించారు.
![Jaat Movie: జాట్ దెబ్బకు రికార్డులన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయిగా..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/jaat-sunny-deol-film1.jpg?w=1280)
హిందీ సినిమాలపై, అక్కడి ఇండస్ట్రీపై, వాళ్ళు తీసే సినిమాలపై టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఆ మధ్య కొన్ని కామెంట్స్ చేసాడు.. ఇవి వాళ్లకు బాగానే గుచ్చుకున్నాయి కూడా. నాగవంశీ చెప్పిందే నిజమే అని ఒప్పుకున్న బాలీవుడ్ దర్శకులు కూడా ఉన్నారు. అంత హాట్ కామెంట్స్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? బాలీవుడ్ అంతా బాంద్రా, జుహులో ఖరీదైన ప్రేక్షకుల కోసమే సినిమాలు తీస్తున్నారు.. హిందీ సినిమాకు అసలైన మాస్ బొమ్మ చూపించింది మాత్రం బాహుబలి, పుష్ప లాంటి సినిమాలే అన్నాడు నాగవంశీ. ఈయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోని సింగిల్ స్క్రీన్స్‌కు మన సలార్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలతోనే కళ వచ్చింది. పైగా బాలీవుడ్‌కు మాస్‌ను కొత్తగా పరిచయం చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్లూ అక్కడ కూడా మాస్ సినిమాలు వచ్చాయి.. యాక్షన్ సినిమాలు వాళ్లు కూడా తెరకెక్కించారు. కానీ కొన్నేళ్లుగా వాళ్లు కలలో కూడా ఊహించని మాస్‌ను మన దర్శకులు పరిచయం చేస్తున్నారు. బాలీవుడ్‌కు మాస్ మంత్రం నేర్పిస్తున్నారు మన దర్శకులు. వాళ్ల దూకుడు చూస్తుంటే.. అక్కడున్న దర్శకులందరినీ పని లేకుండా చేసేలా కనిపిస్తున్నారు.
సౌత్ నుంచి వచ్చాం అంటే చాలు.. ట్రాక్ రికార్డుతో పనిలేకుండా ఛాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోలు. జాట్ సినిమాలోనూ సన్నీ డియోల్‌ను నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో చూపించారు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ గతంలోనూ చాలా మాస్ సినిమాలు చేసారు కానీ గోపీచంద్ మలినేని చూపించినంత స్టైలిష్‌గా ఎవరూ ప్రజెంట్ చేయలేదు. జాట్‌ను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎప్రిల్ 10న విడుదల చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జాట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఈ సినిమాను హిందీలో మాత్రమే కాదు.. తెలుగు, తమిళంలోనూ విడుదల చేస్తున్నారు.