Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ దూసుకుపోతున్నాడు

Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు 'సోడాల శ్రీదేవి సెంటర్' ట్రైలర్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 3:39 PM

Sridevi Soda Center: కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. రీసెంట్‌‌గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాని మరో హీరోగా నటించాడు. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా ఎలా ఉన్నా సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పలాస సినిమాతో విమర్శలు ప్రశంసలు అందుకున్న కిరణ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

రిలీజ్ దగ్గర పడటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.ఆగస్టు 19(గురువారం) ఉదయం 10 గంటలకు ఈ ట్రైలర్ విడుదల కానుందని వెల్లడించారు. సుధీర్ బాబు – కమెడియన్ సత్యం రాజేష్ కలిసి సినిమా వాల్ పోస్టర్ అంటిస్తూ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు.. సోడాలు శ్రీదేవి పాత్రలో ఆనంది కనిపించనున్నారు. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా ”శ్రీదేవి సోడా సెంటర్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే