Kamal Haasan: తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న కమల్ హాసన్ .. ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Kamal Haasan: తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న కమల్ హాసన్ .. ఫోటో సోషల్ మీడియాలో వైరల్
Kamal Hassan

Kamal Haasan: నటి, దర్శక , చిత్రనిర్మాత సుహాసిని మణిరత్నం మంగళవారం స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో కమల్ హాసన్, అను హసన్,..

Surya Kala

|

Aug 18, 2021 | 12:23 PM

Kamal Haasan: నటి, దర్శక , చిత్రనిర్మాత సుహాసిని మణిరత్నం మంగళవారం స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో కమల్ హాసన్, అను హసన్, చారుహాసన్, అక్షర హాసన్ తదితర కుటుంబ సభ్యులున్నారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు సుహాసిని సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకుంటారు.

దక్షిణాది స్టార్ హీరో కమలహాసన్ తన పూర్వీకుల భవనానికి మరమ్మతులు చేయించారు. మరమ్మతుల అనంతరం ఈ ఇంటికి కమల్ హాసన్ తన ఫ్యామిలీతో కలిపి వెళ్లారు. అలా వెళ్లిన కుటుంబ సభ్యుల్లో సుహాసిని ఒకరు. సుహాసిని ప్రముఖ దర్శకుడూ మణిరత్నం భార్య.  ఈ దంపతులు ఇద్దరూ సినిమాలు తీశారు. అయితే  అశోక్ రాజా సుహాసిని కలిసి ఈ భవనంలోనే పెరిగారట. ఈ భవనం రినోవేషన్ ఫొటోలను సుహాసిని షేర్ చేశారు.

కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. కుటుంబ సభ్యుల ఒక్కొక్కరి పేర్లను పేర్కొన్నారు. ఆ తర్వాత మరమ్మతులు చేయించిన భవనానికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను వేల మందికిపైగా లైక్ చేశారు. వీరిలో కమల్ కుమార్తె శ్రుతి హాసన్‌తోపాటు ఆర్. మాధవన్ కూడా ఉన్నారు.

ఇదిలావుంచితే, ఈ ఏడాది విడుదలైన తమిళ ఆంథాలజీ పూథమ్ పుధు కాలైలో ఒక భాగానికి సుహాసిని దర్శకత్వం వహించారు. భర్త మణిరత్నం తీస్తున్న మ్యాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో సుహాసిని నటిస్తున్నారు. అలాగే కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్ 2, విక్రమ్, పాపనాశం 2, తలైవన్ ఇరుక్కిండ్రన్ చిత్రాలలో నటిస్తున్నారు. తలైవన్ ఇరుక్కిండ్రన్ చిత్రం తమిళ-హిందీ భాషల్లో రూపొందనుంది. దీనిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

గుడిని, దేవుడిని వదిలి ఆఫ్గన్ నుంచి వెళ్ళను.. చంపేస్తే అది కూడా దేవుడి సేవే అనుకుంటా అంటున్న పూజారి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu