AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఎవరో కనిపెట్టండి!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. మూడో సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను..

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఎవరో కనిపెట్టండి!
Throwback Pic
Ravi Kiran
|

Updated on: Aug 18, 2021 | 11:56 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. మూడో సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. కొంతమంది అభిమానులు అయితే ఏకంగా ఈమె కోసం గుడిని సైతం కట్టేశారు. ఇప్పుడు ఈ అందాల భామకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టోపీ ధరించి స్టైల్‌గా ఫోజిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో.. ఇప్పుడు అంతకుమించిన క్యూట్‌నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమెవరో కాదు నిధి అగర్వాల్. ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ‘మున్నా మైకేల్’ చిత్రం ద్వారా బీ-టౌన్ ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్. తెలుగులో నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ మజ్ను’ ఫ్లాప్ అయినా.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి అగర్వాల్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. ఇక తమిళంలో ఈ అమ్మడు ‘ఈశ్వరన్’, ‘భూమి’ చిత్రాల్లో నటించింది. ఈ రెండూ కూడా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్స్‌గా మిగిలాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో కనిపించబోతోంది.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ