Sarkaru Vaari Paata: మే 31 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. ఆయన సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తుందంటే చాలు అభిమానుల్లో ఎక్కడలేని

Sarkaru Vaari Paata: మే 31 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2021 | 1:43 PM

Sarkaru Vaari Paata:

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. ఆయన సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తుందంటే చాలు అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ అభిమానులంతా సర్కారు వారి పాట సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందని తెలుస్తుంది. దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ కొంతభాగం జరుపుకుంది.  హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించిన చిత్రయూనిట్ కి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కరోనా అడ్డు రావడంతో షూటింగ్ లకు ఆలస్యం కావడంతో అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దాంతో మహేష్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు.

కరోనా ప్రభావం తగ్గితే ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను కొనసాగించనుంది. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందువలన ఆయన అభిమానులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ పోస్టర్ తో మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో ఉన్న అభిమానులు. ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా పోస్టర్ ను డిజైన్ చేస్తున్నారట చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ponnambalam: ‘చిరంజీవి అన్నయ్యా మీ సాయం మరువలేనిది’.. ఎమోషనల్ అయిన నటుడు..

Trisha Krishnan: చెన్నై చంద్రం త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే.

Teja Sajja: టాలీవుడ్ బడా బ్యానర్ లో సినిమాచేయబోతున్న జాంబీరెడ్డి హీరో తేజ సజ్జా…