Trisha Krishnan: చెన్నై చంద్రం త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే.

వర్షం సినిమాతో  టాలీవుడ్ లో సూపర్ హిట్ ను అందుకున్న ముద్దుగుమ్మ త్రిష . త్రిష కృష్ణన్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది

Trisha Krishnan: చెన్నై చంద్రం త్రిష పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే.
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2021 | 12:54 PM

Trisha:  వర్షం సినిమాతో  టాలీవుడ్ లో సూపర్ హిట్ ను అందుకున్న ముద్దుగుమ్మ త్రిష . త్రిష కృష్ణన్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .తెలుగులో దాదాపు అందరు  స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది త్రిష. తెలుగులో సూపర్ హిట్ కొట్టడానికి త్రిష ఎక్కువ సమయం తీసుకోలేదు.ప్రభాస్ నటించిన  ‘వర్షం’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన 96సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది త్రిష. త్రిష కెరియర్ లో 60 కు పైగా సినిమాలు చేసింది. ఇప్పటి వరకు వాటిలో 65 పైగా నామినేషన్స్ లో  50 కు పైగా అవార్డ్స్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. రజనీకాంత్ .. కమల హాసన్ .. చిరంజీవి .. మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించింది త్రిష. అయితే ఇటీవల ఈ  అమ్మడికి మెగాస్టార్ చిరంజీవి తో నటించే ఛాన్స్ వచ్చింది. ఆచార్య సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో త్రిష  ఆ సినిమానుంచి తప్పుకుంది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ త్రిష ‘ఆచార్య’ కు టాటా చెప్పిందని ఆమధ్య టాక్ వచ్చింది.

అయితే అప్పుడు చిరంజీవి కి నో చెప్పిన త్రిష.. ఇప్పుడు బాలయ్య కు ఎస్ చెప్పిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేసిన దర్శకుడు.. ఒక హీరోయిన్ గా త్రిష ని సంప్రదించారట. త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. చిరు సినిమాకు నో చెప్పి బాలయ్య సినిమాకు ఓకే చెప్పడంతో మెగా ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..