Mahesh Babu: తనయుడు గౌతమ్ పుట్టిన రోజు.. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ మహేష్ పోస్ట్..
గుర్తుపెట్టుకో.. నీకు అవసరమున్న ప్రతిసారీ నేను నీ వెన్నంటే ఉంటాను. లవ్ యూ.. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడికి సోషల్ మీడియా ద్వారా బర్త్ విషెష్ తెలిపారు మహేష్. ” నా యంగ్ మ్యాన్ గౌతమ్‌కు 16వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీంతోలో ఉత్తమమైన వ్యక్తిగా ఎదిగే క్షణాల కోసం నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలోని ఈ కొత్త మార్గంలో నీకు మంచి జరగాలని దీవిస్తున్నాను.. గుర్తుపెట్టుకో.. నీకు అవసరమున్న ప్రతిసారీ నేను నీ వెన్నంటే ఉంటాను. లవ్ యూ.. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అలాగే తన అన్నయ్యకు సితార సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ” నాకోసం నువ్వు చేస్తున్న ప్రతిపనికీ.. నాకు సోదరుడిగా ఉన్నందుకు నిన్నెంతో ప్రేమిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య ” అంటూ రాసుకొచ్చింది.
అలాగే మహేష్ సతీమణి నమ్రత సైతం తన తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానేది ఎప్పటికీ మర్చిపోలేను. పెద్దయ్యాక అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు నీ ప్రయత్నం చేయ్యు. జీవితంమంటే తుఫాన్ కోసం ఎదురుచూడడమే కాదు. వర్షంలో నాట్యం చేయడం నేర్చుకోవడమే. నీ కలల వెంట పరిగెత్తు. గుర్తుపెట్టుకునే ఎల్లప్పుడూ నీతో నేనుంటాను. నువ్వు ఊహించినదానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో పూజా హేగ్డే కథానాయికగా నటిస్తోండగా.. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.