Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న పెన్ని సాంగ్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహేష్.. సితార..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న పెన్ని సాంగ్.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహేష్.. సితార..
Penny Song
Rajitha Chanti

|

Mar 21, 2022 | 6:07 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‏గా వస్తోన్న ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ దూసుకుపోతున్నారు. ముందు నుంచి ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక సినిమా అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట చిత్రాన్ని గ్రాండ్‏గా విడుదల చేయనున్నారు.. ఇక నిన్న (మార్చి 20న) విడుదలైన పెన్ని సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. కేవలం 24 గంటల్లోనే పెన్ని సాంగ్ 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

సర్కారు వారి పాట సినిమా నుంచి రెండవ పాటగా వచ్చిన ఈ పెన్నీ వీడియో సాంగ్ ద్యారా మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని సిల్వర్ స్క్రీన్‏కి తొలిసారిగా పరిచయం అయింది. ఈ పాట తండ్రీ-కూతురు ద్వయం అందమైన డ్యాన్స్‏తో రూపొందింది. ముందుగా నిన్న విడుదలైన ఈ పాట ప్రోమోకు విశేష స్పందన లభించింది. పూర్తి పాట దానిపై ఉన్న హైప్‌ని మించిపోయింది. సితార ఒక రాక్‌స్టార్‏లా తన డ్యాన్స్‏తో అదరగొట్టింది. దానితో పాటు తన హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు మరింత అందంగా కనిపించాడు. అంతేకాక తన స్టైల్ తో మెస్మరైజ్ చేసాడు. తొలసారి మహేష్.. సితారను ఒకేపాటలో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌‏లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు.

Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..

BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu