Tiger 3 Movie: సినిమా థియేటర్‌లో బాణాసంచా పేల్చిన ఆకతాయిలు.. సల్మాన్ సీరియస్! వీడియో వైరల్
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మువీ ‘టైగర్ 3’ (Tiger 3) దీపావళి సందర్భంగా నవంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. యశ్‌రాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సల్లూ భాయ్ అభిమానులందరూ ఆయా థియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా విడుదల సందర్భంగా పలు చోట్ల సల్మాన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్‌లోని మోహన్ సినిమా థియేటర్‌లో కొంతమంది..
ముంబయి, నవంబర్ 13: సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మువీ ‘టైగర్ 3’ (Tiger 3) దీపావళి సందర్భంగా నవంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. యశ్‌రాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సల్లూ భాయ్ అభిమానులందరూ ఆయా థియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా విడుదల సందర్భంగా పలు చోట్ల సల్మాన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్‌లోని మోహన్ సినిమా థియేటర్‌లో కొంతమంది అభిమానులు బాణా సంచా పేల్చి హంగామా సృష్టించారు. సల్మాన్ ఎంట్రీ సమయంలో థియేటర్‌లో పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.
ఈ అనూహ్య సంఘటనతో దిగ్ర్భాంతి చెందిన ప్రేక్షకులు థియేటర్‌లో భయాందోళనలతో పరుగులు తీశారు. టపాసులు తమపై ఎక్కడ పడతాయోనన్న ప్రాణభయంతో కుర్చీలు దూకుతూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానానికి కూడా హద్దు ఉండాలి. ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Is That Even A Question Baap Tho Baap Hee Hotha Hey😂
PATHAAN KA BAAP TIGER 🔥#SalmanKhan #Tiger3pic.twitter.com/yhvFeVWGlP
— 101™ REPORTS (@viratkohali1231) November 13, 2023
ఈ ఘటనపై మోహన్ థియేటర్‌పై చావాని పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 112 కింద కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజా ఘటనపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘టైగర్ 3’ స్క్రీనింగ్‌లో టపాసులు కాల్చారనే వార్తలు విన్నాను. ఇలాంటి ఘటనలకు పాల్పడటం ప్రమాదకరం. ఇతరులకు ఇబ్బంది కలుగ చేసే ఇలాంటి పనులు చేయకుండా సినిమాని ఎంజాయ్ చేద్దామంటూ’ సల్మాన్ ట్వీట్ చేశారు.
కాగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ నవంబర్ 12న భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 44 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మువీ స్క్రీనింగ్ సమయంలో ఒక్క మాలేగావ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో సల్మాన్ అభిమానులు పటాకులు పేల్చి హల్‌చల్ చేశారు. ఇక దర్శకుడు మనీష్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మువీలో సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, సిమ్రాన్, రిద్ధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా, రణ్‌వీర్ షోరే, అమీర్ బషీర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఇది 2017లో వచ్చిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.