Bigg Boss Telugu 7: రతిక ఉగ్రరూపం.. అస్సలు తగ్గట్లేదుగా..
ఫ్యామిలీ వీక్ ద్వారా కంటెస్టెంట్స్‌కు చాలా హింట్స్ వచ్చాయ్.. దీపావళి ఎపిసోడ్ ద్వారా ఆ హింట్స్ సంఖ్య ఇంకా పెరిగింది. దీంతో నామినేషన్స్ సందర్భంగా రెచ్చిపోయారు కంటెస్టెంట్స్. తాజా ప్రొమోల్లో ఆ హిట్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫీమేల్ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజా ప్రొమోపై మీరూ ఓ లుక్కేయండి...
బిగ్ బాస్ సీజన్ 7 దుమ్మురేచిపోతుంది. ఉల్టా, పుల్టా సీజన్‌లో ఎప్పుడేం జరగుతుందో అర్థం కావడం లేదు. అయితే బయట నుంచి హిట్స్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. దీపావళి ఎపిసోడ్‌లో సైతం వచ్చిన కుటంబ సభ్యులు, ఫ్రెండ్స్.. అటు గెస్ట్‌గా వచ్చిన హైపర్ ఆది కూడా ఎక్కువ హింట్స్ ఇచ్చినట్లు అనిపించింది. దీంతో కొంత కిక్ మిస్ అవుతుందన్న భావన కలిగింది. ఇక సోమవారం నామినేషన్స్ సందర్భంగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగినట్లు తాజా నామినేషన్స్‌లో అర్థమవుతుంది. ఫ్యామిలీ నుంచి వచ్చిన హింట్స్ ఆధారంగా అందరూ తమ ప్రవర్తనను మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రియాంక, రతిక — ప్రియాంక, అశ్విల మధ్య మాటల యుద్దం నడిచింది. తూటాల మాదిరి మాటలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రీ ఎంట్రీ అనంతరం రతికలో చాలాకాలం తర్వాత ఫైర్ కనిపించింది. అటు అర్జున్ సైతం.. రైతు బిడ్డపై డైలాగులు పేల్చాడు. ఆ ప్రొమోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇక ఈ సీజన్‌లో స్పై(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్ దుమ్ము రేపుతోంది. శివాజీ తన మార్క్ స్ట్రాటజీలతో మిగిలిన ఇద్దర్నీ ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురిలో ఒకరికి కప్ దక్కే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. దీపావళి స్పెషల్ సందర్భంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ముగ్గురినే ఎక్కువగా టాప్ 5 లో పెట్టారు.
భోలే ఎలిమినేషన్‌పై విమర్శలు
భోలే ఎలిమినేషన్‌పై నెట్టింట డైలాగ్స్ పేలుతున్నాయి. కేవలం రతికను కాపాడేందుకే బిగ్ బాస్ టీమ్.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. భోలేకు విపరీతమైన ఓటింగ్ పడినప్పటికీ.. విమెన్ కంటెస్టెంట్ రతికను కాపాడాలనే ఉద్దేశంతో.. భోలేను బయటక పంపారన్న ప్రచారం జరుగుతుంది.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..