అడవుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోల కథలు.. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి ??
ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే.. మన హీరోలు కథల కోసం అడువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతున్నాయి. కొండజాతి ముఠాకు నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి ఈ మధ్య ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి..? ట్రెండ్ మారింది.. హీరోలు కూడా మారాల్సిందే.. అలా కాదు మేమిక్కడే ఉంటాం.. ఇంకా పాత పద్దతుల్నే పట్టుకు వేలాడతాం అంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు.
Tollywood News
Follow us
ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే.. మన హీరోలు కథల కోసం అడువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతున్నాయి. కొండజాతి ముఠాకు నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి ఈ మధ్య ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి..?
ట్రెండ్ మారింది.. హీరోలు కూడా మారాల్సిందే.. అలా కాదు మేమిక్కడే ఉంటాం.. ఇంకా పాత పద్దతుల్నే పట్టుకు వేలాడతాం అంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. అందుకే అప్డేట్ అవుతున్నారు హీరోలు. అందరూ విజువల్ వండర్స్ వైపు చూస్తున్నారు.. దీనికి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కూడా తోడైంది. తాజాగా విడుదలకు సిద్ధమైన కోట బొమ్మాళి నుంచి పుష్ప 2, కంగువా, తంగలాన్ వరకు అన్నీ అవే నేపథ్యమే.
తమిళ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు పాన్ ఇండియా వైడ్‌గా సత్తా చూపించిన సినిమా రాలేదు. కంగువా ఈ లోటు తీరుస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇందులో ఓ అడవి జాతికి నాయకుడిగా నటిస్తున్నారు సూర్య. మరోవైపు తంగాలన్ సినిమాలో విక్రమ్ కూడా తెగ నాయకుడిగా నటిస్తున్నారు. కబాలి ఫేమ్ రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు.
తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కథలే వస్తున్నాయి. తేజ మార్ని తెరకెక్కిస్తున్న కోట బొమ్మాళిలో అడవి నేపథ్య బాగానే ఉంది. మలయాళ సినిమా నాయట్టుకు ఇది రీమేక్. పుష్ప 2 కథ కూడా ఎక్కువగా అడవుల్లోనే సాగుతుంది.
పుష్పలో స్మగ్లర్ నుంచి సిండికేట్ లీడర్‌గా మారిన అల్లు అర్జున్.. పార్ట్ 2లో మొత్తం మాఫియాను కంట్రోల్ చేసే స్థాయికి ఎలా ఎదిగారనేది చూపిస్తున్నారు సుకుమార్. మొత్తానికి మన సినిమాల కథలు ఫారెస్ట్ నేపథ్యంలో తిరుగుతున్నాయిపుడు.