Hema : నటి హేమ పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన మా అసోసియేషన్ .. కానీ ఓ కండీషన్
తాజాగా టెస్ట్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలిందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. నటి హేమ పై మా అనౌసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. బెంగుళూరు డ్రగ్స్ కేస్ నేపథ్యంలో హేమా పై సప్సెన్షన్ విధించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణల పై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆమె తెలిపారు. తాజాగా టెస్ట్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలిందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. నటి హేమ పై మా అనౌసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. బెంగుళూరు డ్రగ్స్ కేస్ నేపథ్యంలో హేమా పై సప్సెన్షన్ విధించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తాజాగా తనకి డ్రగ్స్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందంటూ హేమా వీడియో విడుదల చేయడంతో మా అసోసియేషన్ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే మీడియా తో మాట్లాడవద్దని హేమా కు కండీషన్ పెట్టింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. కానీ తాను హైదరాబాద్‌లోనే ఉన్నాను అంటూ హేమ ఓ వీడియో చేసింది.
ఆ తర్వాత పోలీసుల హేమాను అరెస్ట్ చేశారు. అనంతరం డ్రగ్స్ టెస్ట్ లు నిర్వహించారు. హేమను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పై కూడా హేమ స్పందించారు. మీడియాలో వస్తున్న ఆరోపణలను బట్టి తనను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది మా అసోసియేషన్.

హేమ ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



