Maa Elections 2021: మా ఎన్నికల జోరు.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండగా.. అభ్యర్థులు ప్రచారా వేగాన్ని పెంచారు.

Maa Elections 2021: మా ఎన్నికల జోరు.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..
Prakash Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 7:59 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండగా.. అభ్యర్థులు ప్రచారా వేగాన్ని పెంచారు. ఇప్పటికే బహిరంగ ఆరోపణలు చేసుకున్న అభ్యర్థులు.. ఇప్పుడు వినూత్న ప్రచారానికి తెరతీశారు. సోషల్ మీడియా వేదికగా.. మా ఎన్నికల యుద్దాన్ని ప్రారంభించారు. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచువిష్ణు, బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేసి.. ప్రచారంలో బిజీ అయ్యారు. ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ పోటీ పడుతుండగా.. జనరల్ సెక్రటరీ పోటి కోసం బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటి చేస్తున్నాడు. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు అభ్యర్థులు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. తన ప్యానల్ సభ్యులతో ఉన్న పాంప్లేట్ ఫోటో షేర్ చేస్తూ.. #MaaElections2021..యూవర్ ఓట్ ఈజ్ యూవర్ వాయిస్.. మా హితమే.. మా అభిమతం..మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జతచేసి ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్లో శ్రీకాంత్, ఉత్తేజ్, అనసూయ-అజయ్-భూపాల్-బ్రహ్మాజీ-ఈటీవి ప్రభాకర్-గోవింద్ రావు-ఖయ్యుం-కౌశిక్-ప్రగతి-రమణారెడ్డి-శ్రీధర్ రావు-శివారెడ్డి-సమీర్-సుడిగాలి సుధీర్-సుబ్బరాజు-సురేష్ కొండేటి-తనీష్-టార్జాన్ ఉన్నారు . అలాగే ఇందులో జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ, వైస్ ప్రెసిడెంట్ గా హేమ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గా శ్రీకాంత్- జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్ ఉన్నారు. కాగా… అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నయి.. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

ట్వీట్..

Also Read: Radhe Shyam: సంక్రాంతి బరిలో ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన మేకర్స్..

Bigg Boss 5 Telugu: నిబంధనలు ఉల్లంఘించిన కంటెస్టెంట్స్.. జెస్సీ తప్పుకు కాజల్‏కు పనిష్మెంట్.. .. బిగ్‏బాస్ ఇలా షాకిచ్చాడేంటీ..

Bigg Boss 5 Telugu: ఇదేం దుస్థితి.. ఇంట్లో ఆకలి బాధలు.. చెత్త కవర్‏లో ఫుడ్ తీసుకునేందుకు లోబో ప్రయత్నాలు..