Oka Pathakam Prakaram: ఉస్తాద్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఒక పథకం ప్రకారం మూవీ మెలోడీ..
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఒక పథకం ప్రకారం. చాలా రోజుల తర్వాత సాయి రామ్ శంకర్ నుంచి వస్తున్న సినిమా ఇది.
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఒక పథకం ప్రకారం. చాలా రోజుల తర్వాత సాయి రామ్ శంకర్ నుంచి వస్తున్న సినిమా ఇది. సాయిరామ్ శంకర్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్రంలోని ఓసారిలిరా లిరికల్ సాంగ్‌ను ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేసారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది.
ఓసారిలిరా.. ఓసారిలా.. కుడికాలు మోపి గుడిలోకి రా.. అంటూ అందమైన లిరిక్స్ అందించారు రెహమాన్. ఇప్పటికే రవితేజ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌లో సినిమా కాన్సెప్టును చూపించారు మేకర్స్.. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.