VJ Sunny: బిగ్ బాస్ విజేత సన్నీ‌పై రౌడీ షీటర్ దాడి.. పోలీసులకు ఫిర్యాదు..

హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సన్నీపై బుధవారం ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ నిలిపివేసి, మీర్‌పేట్ పోలీసులకు సన్నీ ఫిర్యాదు చేశాడు.

VJ Sunny: బిగ్ బాస్ విజేత సన్నీ‌పై రౌడీ షీటర్ దాడి.. పోలీసులకు ఫిర్యాదు..
Vj Sunny
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jun 09, 2022 | 11:08 AM

బిగ్ బాస్ విజేత సన్నీ(VJ Sunny) పై దాడి జరిగింది. హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సన్నీపై బుధవారం ఓ రౌడీ షీటర్ దాడి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ నుంచి నేరుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు సన్నీ.. దాడి చేసిన రౌడీ షీటర్‌పై ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మీర్‌పేట్ పోలీసులు, రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం వాసి వీజే సన్నీ బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు ఎన్నో షోలు చేసినా.. దక్కిని పాపులారిటీ, బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా దరి చేరింది. బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచి, ట్రోఫీ అందుకున్నాడు. దీంతో సన్నీకి వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సన్నీ పలు సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. సన్నీ పై దాడి జరగడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.