Love Story : లవ్ స్టోరీ సక్సెస్ సంబరాలు… మ్యాజికల్ సెలబ్రేషన్స్‌లో చిత్రయూనిట్..
మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించారు.
Love Story: మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబర్ 24 న రిలీజ్ అయిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే హిట్ టాక్ దూసుకుపోతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస వాయిదాల అనంతరం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో అని నిర్మాతలు.. డైరెక్టర్, చిత్రయూనిట్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వారి అంచనాలకు మించి మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అధ్బుతమనే చెప్పాలి. లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు జై కొట్టారు. థియేటర్లలో చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి నెలకొంది. థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తుండగా.. ఆన్ లైన్లో టికెట్స్ దొరకని పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ లవ్ స్టోరీ మ్యాజికల్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :