AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దీపావళికి విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ ఆరు మాత్రం చాలా స్పెషల్..

ఈ ఏడాది దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఆరు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో నాలుగు సినిమాలు తెలుగు చిత్రాలు కాగా.. మరో రెండు సినిమాలు తమిళం నుంచి డబ్బింగ్ కాబోతున్నాయి. మరీ ఈసారి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకోండి.

Diwali 2024: దీపావళికి విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ ఆరు మాత్రం చాలా స్పెషల్..
Diwali Movies
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2024 | 11:40 AM

Share

బతుకమ్మ, దసరా పండగ సందడి పూర్తైంది. ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్నాయి. అయితే ఈసారి దసరాకు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కానీ ఈసారి దీపావళి పండక్కి మాత్రం ఆరు పెద్ద చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈసారి పండక్కి ఏఏ సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్.

కిరణ్ అబ్బవరం KA

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటేస్ట్ మూవీ KA. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. కాస్త ఆలస్యంగానే ఈ మూవీ విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

లక్కీ భాస్కర్..

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగులో నేరుగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాను అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో..

ఎలాంటి అప్డే్ట్స్, ప్రచారం లేకుండానే సైలెంట్ గా తన కొత్త మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు హీరో నిఖిల్. ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రివీల్ చేశాడు. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వసంత్ రుక్మిణి ఈ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.

జిబ్రా..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ జీబ్రా. దీపావళి రేసులో ఉన్న మరో చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్, జయం రవి సోదరుడు నటించిన చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ కానున్నాయి. అమరన్ సినిమా కోసం తెలుగు అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఒకే సమయంలో ఆరు సినిమాలు విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలుస్తారనే సందిగ్ధత నెలకొంది.

ఇది చదవండి: OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.