AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghuvaran: రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ తనయుడి గురించి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం తండ్రి మాదిరిగా ఫీచర్స్ ఉండటంతో అతను యాక్టింగ్ కెరీర్ ఆరంభించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే అతను మాత్రం సంగీతం ప్రపంచంలో రాణించాలని ఆరాటపడుతున్నాడు.

Raghuvaran: రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..
Rishi Varun Look
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2025 | 5:00 PM

Share

తెలుగు, తమిళ సినిమాల్లో తన విభిన్నమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు రఘువరన్‌ గుర్తున్నాడు కదా. ‘బాషా’లో మార్క్ ఆంటోని పాత్రలో ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆయన గురించి కాదు… రఘువరన్ కొడుకు రిషివరన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొన్నామధ్య రఘువరన్ కొడుకు రిషి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూసిన నెటిజన్స్ అంతా.. అచ్చం తండ్రిలానే ఉన్నాడు.. ఆయన్నే చూస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్లు పెట్టారు. ఫోటోల్లో రిషివరన్ స్టైల్, లుక్స్ కూడా తండ్రిని తలపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు.

Rishi Varun

రిషి వరున్ ఏడాది కిందడి ఫోటో

రఘువరన్ గురించి మాట్లాడుకుంటే… ఫిల్మ్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకున్న అనుభవంతో కెరీర్ మొదలుపెట్టారు. తొలుత హీరో పాత్రలు చేసినా.. ఆ తరువాత విలన్‌గా తనదైన ముద్ర వేశారు. భిన్నమైన వాయిస్, సన్నగా పొడవుగా ఉండే రూపం, గంభీరత కలిగిన బాడీ లాంగ్వేజ్‌తో ఆయకంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో చేసిన ‘బాషా’లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండేలా చేసింది. తెలుగులో కూడా పలు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. చివరిగా 2008లో విడుదలైన ‘ఆటాడిస్తా’ చిత్రంలో కనిపించారు. అదే సంవత్సరం రఘువరన్ అనారోగ్యంతో కన్నుమూశారు. అతిగా మద్యం సేవించడం, కుటుంబ విభేదాలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

1996లో నటి రోహిణితో వివాహం చేసుకున్న రఘువరన్‌కు 2000లో రిషివరన్ జన్మించాడు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రిషి తల్లితోనే ఉంటూ పెరిగాడు. తండ్రి మరణం తర్వాత రిషి ఆయన్ని మరచిపోలేకపోయాడట. ప్రస్తుతం రిషివరన్ సంగీతంపై దృష్టి సారిస్తున్నాడు. కొన్ని ఇంగ్లీష్ ఆల్బమ్‌లను విడుదల చేశాడు. ‘ఫాదర్-సన్ బ్యారెల్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రిషి వరుణ్ 6 నెలల క్రితం వీడియో….

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై