AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: చిక్కుల్లో ‘ఆదిపురుష్’.. ప్రభాస్‏తోపాటు నిర్మాతలకు లీగల్ నోటీసులు.. ఆ తప్పును సరిదిద్ధాల్సిందే..

ఆదిపురుష్ చిత్రయూనిట్‏కు మరో షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాతలతోపాటు.. నటీనటులకు కూడా ఆశిష్ రాయ్ లీగల్ నోటీసులు పంపారు.

Adipurush: చిక్కుల్లో 'ఆదిపురుష్'.. ప్రభాస్‏తోపాటు నిర్మాతలకు లీగల్ నోటీసులు.. ఆ తప్పును సరిదిద్ధాల్సిందే..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2022 | 5:11 PM

Share

ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూసిన డార్లింగ్ అభిమానులకు ఆదిపురుష్ టీజర్ నిరాశ మిగిల్చింది. ప్రభాస్ లుక్.. వీఎప్ఎక్స్ ఎక్కువైందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అంతేకాకుండా.. రాముడు.. హనుమంతుడి లుక్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆదిపురుష్ చిత్రయూనిట్‏కు మరో షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాతలతోపాటు.. నటీనటులకు కూడా ఆశిష్ రాయ్ లీగల్ నోటీసులు పంపారు. డైరెక్టర్ ఓంరౌత్, టీసిరీస్ ఫేమ్ భూషణ్ కుమార్, సైఫ్ అలీఖన్, ప్రభాస్, కృతి సనన్‏కు లీగల్ నోటీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా విడుదలైన టీజర్‏లో హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రాముడు, రావణుడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అనేక ఇతర పౌరాణిక పాత్రలను ఉన్నాయని ఆరోపించారు. వాస్తవ పాత్రలు కాకుండా ఇస్లామీకరణగా ప్రజెంట్ చేశారన్నారు. హిందూ గ్రంధమైన రామాయణం అసలు పాత్రలు.. సాంసక్కృతిక విలువలను ఆదిపురుష్ యూనిట్ సభ్యులు దెబ్బతీశారని పిటిషన్‏లో పేర్కొన్నారు.

“ఆదిపురుష్” చిత్రంలో, శ్రీరాముడు, శ్రీ హనుమంతుడు తోలు దుస్తులను ధరించి ఉన్న వారి నిజ స్వరూపాన్ని తారుమారు చేశారు. రామాయణం వాస్తవ వర్ణన ప్రకారం, వనవాసం తర్వాత ఒక సాధువు వలె అడవిలో నివసించే శ్రీరాముడు గురించి రామాయణంలో వివరించారు. కానీ ఈ విషయాలన్నింటినీ “ఆదిపురుష్” సినిమా నిర్మాత ఉద్దేశపూర్వకంగా మార్చారు. హిందువుల మతవిశ్వాసాలను దెబ్బతీశారు.

ఇవి కూడా చదవండి

అలాగే సీతపాత్రలో ఉన్న కృతి సనన్ డ్రెస్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా శ్రీరాముడి ప్రతిష్టను దెబ్బతీశారు. రావణుడిని ఒక ఇస్లామిక్‏గా చూపించారని ఆశిష్ రాయ్ నోటిసులో పేర్కొన్నారు. ఈ సినిమా ప్రమోషన్లను వెంటనే నిలిపివేయాలని.. అలాగే పద్నాలుగు రోజుల్లో వారందరూ క్షమాపణలు చెప్పాలని.. చిత్రంలోని అభ్యంతరకమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఈ సినిమా పై చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

Notice To Adipurush

Notice To Adipurush

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.