Urvasivo Rakshasivo: ఉర్వశివో రాక్షసివో నుంచి లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘దీంతానా’ లిరిక్స్..
"విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటింస్తోంది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.

యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం ఉర్వశివో రాక్షసివో. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటింస్తోంది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.
ఇక తాజాగా సోమవారం ఈ చిత్రం నుండి “దీంతననా” అనే మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు. “నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా.. నీ పాదమే దాటు ప్రతిచోటునా.. నీ పెదవులు తాకే నా పేరును వింటా.. ఓ స్పర్శ కే పొంగిపోతానట.. కాలం కలిపింది ఈ జోడి బాగుందని” అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి.
రిలీజ్ చేసిన ఈ పాటలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ మరో క్లాసి మెలోడీ యాడ్ అయింది అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




