Nayanthara-Vignesh Shivan: నయన్ దంపతులకు షాక్.. పిల్లలు ఎలా పుట్టారు ?.. వివరణ ఇవ్వాలన్న ప్రభుత్వం..
సర్రోగసి పద్దతి ద్వారా పేరెంట్స్ అయిన నయన్ జంటగా తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుట్టారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార.. విఘ్నేష్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది జూన్ 9న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే కవలలకు తల్లిదండ్రులు అయినట్లుగా ప్రకటించడంతో సాధారణ ప్రజలతోపాటు సెలబ్రెటీలు కూడా షాకయ్యారు. అయితే వీరిద్దరు సర్రోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిట్లుగా తెలుస్తోంది. అంటే అద్దె గర్భం ద్వారా నయన్ పిల్లలకు జన్మనిచ్చింది. ఓవైపు నయన్ తీరు పట్ల విమర్శలు వస్తుండగా.. మరికొందరు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సర్రోగసి పద్దతి ద్వారా పేరెంట్స్ అయిన నయన్ జంటగా తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే ఎలా పిల్లలు పుట్టారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
భారతదేశంలో సర్రోగసి పద్దతి చట్టరీత్యా నేరం. గర్భం దాల్చలేని సందర్భంలో మాత్రమే ఈ పద్దతిని ఆవలంభించవచ్చు. అంతేకానీ సాధారణ మహిళలు ఈ పద్దతిలో పిల్లలు కనడం నేరం. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ నయన్, విఘ్నేష్ జంటకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. మరీ ఈ విషయంపై నయన్ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.




ప్రస్తుతం నయనతార.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




