Surrogacy : అద్దె గర్భాలతో తల్లిగా మారతున్న సెలబ్రెటీలు.. ఇంతకీ సర్రోగసి అంటే ఏంటో తెలుసా ?..

నాలుగునెలల క్రితం (జూన్ 9న) దర్శక నిర్మాత, నటుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన నయన్.. 2022 అక్టోబర్ 9న తాము సర్రోగసీ ద్వారా తల్లిడండ్రులుగా మారినట్లు గుడ్ న్యూస్ చెప్పారు.

Surrogacy : అద్దె గర్భాలతో తల్లిగా మారతున్న సెలబ్రెటీలు.. ఇంతకీ సర్రోగసి అంటే ఏంటో తెలుసా ?..
Nayan Vignesh
Follow us

|

Updated on: Oct 10, 2022 | 4:02 PM

ప్రస్తుతం సెలబ్రెటీలు సర్రోగసి పద్దతికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లిగా మారడానికి అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు సర్రోగసీ ద్వారా తల్లి-తండ్రిగా మారిన సెలబ్రిటీల జాబితా చాలా పెద్దదే. ఈ జాబితాలో.. బాలీవుడ్ నటిమణులు ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, సన్ని లియోన్, షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీఖాన్, అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావు, ఏక్తా కపూర్, టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి, తదితరులు ఉండగా.. తాజాగా ఈ జాబితాలో చేరిన దక్షిణాది నటి నయనతార చేరింది. నాలుగునెలల క్రితం (జూన్ 9న) దర్శక నిర్మాత, నటుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన నయన్.. 2022 అక్టోబర్ 9న తాము సర్రోగసీ ద్వారా తల్లిడండ్రులుగా మారినట్లు గుడ్ న్యూస్ చెప్పారు. సర్రోగసీ ద్వారా పండంటి మగపిలల్లకు జన్మనిచ్చింది నయన్. ఈ విషయాన్ని ఇన్‏స్టా లో పోస్ట్ చేస్తూ.. తమ పిల్లలకు ఉయిర్ (Uyir) యులగమ్( Ulagam) అని పేర్లు పెట్టినట్లు తెలిపారు.

సరోగసీ అంటే…

అండాన్ని దాచుకోవచ్చు… కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు.. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు అడ్డు కాకూడదని కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్‏ను కలిగివున్నవారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైనవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, ఈ సర్రోగసీ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. ఇటువంటివారికి వరంగా మారింది ఎగ్‌ ఫ్రీజింగ్‌ టెక్నాలజీ. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాతనుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా తమ శుక్ర కణాలతో సంయోగపర్చి పిండాన్ని సర్రోగసీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఇదే పద్దతిలో తండ్రిగా మారాడు.

ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది?

తల్లి కావాలనుకున్న మహిళ అండాన్ని మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్ని ఫ్రీజింగ్ చేస్తారు. ఫ్రీజ్ అయిన అండాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఇలా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి తీసుకువచ్చిన అండంలోకి భర్త వీర్యకణాన్ని చొప్పించి ప్రయోగశాలలో ఫలధీకరణ చేస్తారు. అలా ‘పిండం’ తయారవుతుంది. ఇలా తయారైన పిండాన్ని తాము ఎంపికచేసుకున్న మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ దంపతుల పిండాన్ని గర్భంలో మోసి అభివృద్ధి అయిన అనంతరం సరోగసీ మదర్ సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ ద్వారా ప్రసవిస్తుంది. డెలివరీ అనంతరం ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వీరి పిండాన్ని తొమ్మిది నెలలపాటు మోసిన మహిళకు ముందే మాట్లాడుకున్న ప్రకారం కొంత డబ్బు అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైద్యుల పర్యవేక్షణలో సాగుతుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు 40 నుంచి 60 శాతం వరకూ ఉంటాయి. ఐవీఎఫ్, టెస్ట్‌ట్యూబ్ బేబీ వంటి వాటిల్లో కూడా సక్సెస్‌ రేటు 60 లోపే ఉంటుంది. భారత్‏లో సర్రోగసీ గర్బాలు ( గర్భాన్ని మోసి అద్దె మహిళలు) అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంతో దేశంలోకి విదేశీ మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లల ఉత్పత్తి కర్మాగారాలుగా మారుతున్న దేశాలు..

ఈ పద్దతిని అవలంభించడంలో ముందు వరుసలో భారత్, అమెరికా, థాయిలాండ్, ఉక్రెయిన్ ఉన్నాయి. 2012 నాటికే సరోగసీ మార్కెట్‏కు క్యాపిటల్‏గా మారింది భారత్. ఏడాదికి సరోగసీ టూరిజం విలువ 500 మిలియన్ డాలర్లని అంచనా. సంతాన లేమితో బాధ పడుతున్న జంటలు అద్దె గర్భాలకోసం ఉక్రెయిన్ బాట పడుతున్నారు. అద్దె గర్భాల(సర్రోగసీ) కు ప్రధాన కేంద్రంగా మారింది ఉక్రెయిన్. ఇక్కడ సర్రోగసీ ద్వారా పిల్లలను కని రూ.40-42 లక్షలకు అమ్మకం జరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఉక్రెయిన్లో ఏటా 2500 నుంచి 3000వరకు అద్దె గర్భాల ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. ఉక్రెయిన్ లో పరిశ్రమ స్థాయికి చేరిన వ్యాపారాత్మక అద్దె గర్భాల మార్కెట్. ప్రపంచంలో అద్దె గర్భాలను ఆమోదిస్తున్న అతి కొన్ని దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ప్రపంచంలో అద్దెగర్భాలు ధరించడంలో ముందున్న దేశాల్లో అమెరికా,భారత్, థాయ్ లాండ్, ఉక్రెయిన్, రష్యా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అద్దె గర్భాల మార్కెట్ విలువ 5 బిలియన్ యూరోలు(రూ.44,146 కోట్లు) ఉంది. ఉక్రెయిన్లో అద్దె గర్భం సగటు విలువ రూ.22 లక్షలు నుంచి రూ.61 లక్షలు.. అన్ని రకాల సర్రోగసీని నిషేధించిన దేశాల్లో.. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, బల్గేరియా ఉన్నాయి.

యూకే, ఐర్లండ్, డెన్మార్క్, బెల్జియం, సర్రోగసీకి అనుమతి ఉన్నప్పటికీ..ఈ దేశాల్లో అద్దె గర్భం మోసిన తల్లికి సాధారణ ఖర్చులు మినహా వ్యాపారాత్మక ధోరణితో డబ్బు చెల్లించడం నిషేధించారు. కమర్షియల్ సర్రోగసీ(వ్యాపారాత్మక అద్దెగర్భాలు) ఒప్పుకున్న దేశాల్లో భారత్(2002), రష్యా, ఉక్రెయిన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.

భారత్ లో తాజా చట్టం…

2021లో అద్దె గర్భం నియంత్రణ చట్టం-2021 పేర దీన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలో భాగంగా వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి కేంద్రం ఆమోదించింది. ఇది వాణిజ్యపరమైన సరోగసీని నిషేధిస్తుంది. గర్భధారణ సమయంలో వైద్య ఖర్చులు, భీమా కవరేజీ మినహా అద్దె తల్లికి ఎలాంటి ద్రవ్య పరిహారాన్ని కలిగి ఉండని, పరోపకార సరోగసీని మాత్రమే అనుమతిస్తుంది.

అనైతిక సరోగసీ నియంత్రణకు చట్టంలో కొన్ని నిబంధనలు విధించారు, వాటిలో..

1.దంపతులిద్దరూ భారతీయులై ఉండాలి 2. వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలు సరోగసీని స్వీకరించవచ్చు 3.అయితే జంటకు వివాహమై అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తవ్వాలి. 4.ఇద్దరిలో ఒకరు వంధ్యత్వంకు గురైతే సరోగసీని ఎంచుకునేందుకు అనుమతి 5. పరోపకారం కోసం స్వీకరించవచ్చు 6.వాణిజ్య ప్రయోజనాల కోసం చేయరాదు 7.అమ్మకం, వ్యభిచారం లేదా ఇతర రకాల దోపిడీ కోసం పిల్లలను ఉత్పత్తి చేయడం చేయరాదు 8. నిబంధనలలో పేర్కొన్న ఏదైనా వ్యాధి, పరిస్థితుల్లో సరోగసీని స్వీకరించవచ్చు 9. భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి 10. సరోగసీ ప్రక్రియకు వెళుతున్న దంపతులకు.. తమకు పుట్టినవారైనా లేదా దత్తత తీసుకున్న పిల్లలు ఉండకూడదు. 11.మేజిస్ట్రేట్ కోర్టు నుంచి బిడ్డ పేరెంటింగ్, కస్టడీ ఆర్డర్ తీసుకోవాలి 12. అద్దె గర్భం మోసే తల్లికి 16 నెలల బీమా రక్షణ కల్పించాల్సింది ఆ దంపతులే.

అద్దె గర్భం మోసే తల్లికి నిబంధనలు..

1. అద్దె గర్భం మోసేందుకు అర్హత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి 2. సరోగసీకి వెళుతున్నజంటకు ఆమె దగ్గరి బంధువై ఉండాలి 3. సరోగేట్ తల్లి వివాహితురాలై ఉండాలి 4. ఆమెకు కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి 5. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి 6. ఒక మహిళ తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి

భారత్‏లో ఏటా దాదాపు 25వేల పిల్లలు సర్రోగసీ ద్వారా జన్మిస్తున్నారని అంచనా. మెక్సికో, నేపాల్, పోలండ్, జార్జియాల్లో సైతం సర్రోగసీకి అనుమతి ఉన్నట్లు వెల్లడించింది. వ్యాపారాత్మక సర్రోగసీ కోసం ఇతర దేశాలకు వెళ్లడాన్ని నిషేధించిన ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచంలో సర్రోగసీ సగటు ఖర్చు(లాభేతర సర్రోగసీ సంస్థ అధ్యయనంలో వెల్లడైన అంచనాలు 2014 సంవత్సరంలో) అమెరికా- లక్ష డాలర్లు, భారత్- 47,350 డాలర్లు, థాయ్ -లాండ్-52వేల డాలర్లు, ఉక్రెయిన్- 49,950 డాలర్లు, జార్జియా- 49,950 డాలర్లు, మెక్సికో-45వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో వాణిజ్యపరమైన సరోగసీపై నిషేధం ఉంది. కెనడాలో సైతం వాణిజ్యపరమైన సరోగసీకి అనుమతి లేదు. దగ్గరి బంధువుల ద్వారా సరోగసీ చేపట్టేందుకు మాత్రమే అనుమతి ఉంది. చైనాలో నిషేధం. ఫ్రాన్స్, జర్మనీలో సరోగసీ చట్ట వ్యతిరేకమని వెల్లడైంది. అమెరికాలో .. సరోగసీ నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో వేరుగా ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో సరోగసీకి అనుమతి లేదు. ఈ పద్ధతిని కేవలం వైద్యపరమైన ప్రతిబంధకాలు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఎగ్‌ ఫ్రీజింగ్‌ ప్రక్రియను ఇటీవలే బ్యాన్‌ చేసిన సింగపూర్‌. ఇక్కడ జననాలు రేటు 1.1 కనిష్ట స్థాయికి చేరడంతో బ్యాన్‌ చేసింది సింగపూర్.

సరోగసీ పద్దతిలో తల్లయిన సెలబ్రిటీలు.

1. షారుక్‌ఖాన్‌, గౌరీ 2. అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు 3. ఫరాఖాన్‌, శిరీష్‌ కుందర్‌ 4. తుషార్‌ కపూర్‌ (సింగిల్‌ పేరెంట్‌) 5. ఏక్తా కపూర్‌ (సింగిల్‌ పేరెంట్‌) 6. కరణ్‌ జోహార్‌ (సింగిల్‌ పేరెంట్‌) 7. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్‌ 8. సన్నీలియోన్‌, డానియల్‌ వెబర్‌ 9. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ 10. విఘ్నేశ్- నయనతార

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??