Trisha: ‘పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ కోసం వెయిటింగ్’.. హీరోయిన్ త్రిష..

ఇప్పటివరకు త్రిష పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రమోషనల్లో మరోసారి తన వివాహం గురించి స్పందించింది.

Trisha: 'పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ కోసం వెయిటింగ్'.. హీరోయిన్ త్రిష..
Trisha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 10, 2022 | 10:48 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దా్ల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన త్రిష.. అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. చాలా కాలాం తర్వాత 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో పాల్గోన్న త్రిష మరింత అందంగా కనిపించింది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఇక తెరపైకి మరోసారి త్రిష పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పటివరకు త్రిష పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రమోషనల్లో మరోసారి తన వివాహం గురించి స్పందించింది.

త్రిష మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది అడుగుతుంటారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు నాకు నచ్చదు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే నేను సమాధానం ఇస్తాను. ఎప్పుడు అనేది స్పష్టంగా చెప్పలేను. నేను పూర్తిగా ఎవరితో ఉన్నాను.. నా జీవితంలో ఎవరిని కలవబోతున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను జీవితాంతం ఉండగలిగే వ్యక్తి ఇతనే అని నాకు నమ్మకం కలగాలి.

అలాగే విడాకుల మీద కూడా నాకు నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్లలో పెళ్లి చేసుకుని అసంతృప్తిగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి పెళ్లిలో ఉండాలనుకోవడం లేదు.” అంటూ చెప్పుకొచ్చింది.