AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: భారతీయ చిత్ర పరిశ్రమపై రాజమౌళి చెరగని సంతకం.. జక్కన్న మార్క్‌ చిత్రాలివే..

భారతీయ సినిమా పరిశ్రమలో ఆయనది చెరగని సంతకం. అపజయాలు ఎరగని విక్రమార్కుడు అతడు. ఇండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన మగధీరుడు అతను. అతనే దిగ్గజ దర్శకుడు...

SS Rajamouli: భారతీయ చిత్ర పరిశ్రమపై రాజమౌళి చెరగని సంతకం.. జక్కన్న మార్క్‌ చిత్రాలివే..
Rajamouli Movies
Narender Vaitla
|

Updated on: Oct 10, 2022 | 10:09 AM

Share

భారతీయ సినిమా పరిశ్రమలో ఆయనది చెరగని సంతకం. అపజయాలు ఎరగని విక్రమార్కుడు అతడు. ఇండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన మగధీరుడు అతను. అతనే దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ప్రతీ సినిమాను ప్రాణం పెట్టి తెరకెక్కించే జక్కన్న ఒక శిల్పా్న్ని చెక్కినట్లు సినిమాను తెరకెక్కిస్తుంటారు. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక్కో సినిమా ఒక్కో అణిముత్యం. ఇండియన్‌ సినిమా ఐకాన్‌ డైరెక్టర్‌ రాజమౌళి పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 10). ఈ సందర్భంగా ఇండియన్‌ చిత్ర పరిశ్రమపై ఇంపాక్ట్‌ చూపించిన రాజమౌళి మూవీస్‌పై ఓ లుక్కేయండి..

Rrr

ఆర్‌.ఆర్‌.ఆర్‌..

భారతీయ సినీ ప్రపంచంలో ట్రిపులార్‌ మూవీది ప్రత్యేక స్థానం. వాస్తవ కథను ఆధారంగా చేసుకొని కాల్పనికాన్ని జోడించి రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సునామి సృష్టించింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి ఇద్దరు అగ్ర హీరోలతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా వరల్డ్‌ వైడ్‌గా రూ. 1200 కోట్లను రాబట్టి ఇండియన్‌ సినిమా స్థాయిన పెంచింది.

Bahubali

బాహుబలి..

2015లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్‌ చూపించింది. తొలిసారి ఇండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాతోనే ప్రభాస్‌ ఇంటర్నేషనల్‌ హీరోగా మారాడు. బాహుబలి తొలి పార్ట్‌ ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేయగా, 2017లో వచ్చి బాహుబలి పార్ట్‌ 2 ఏకంగా రూ. 1800 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

Magadheera

మగధీర..

రాజమౌళి నుంచి వచ్చిన అద్భుత దృశ్య కావ్యాల్లో మగధీర ఒకటి. 400 ఏళ్ల క్రితం జరిగిన కథను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించిన జక్కన్న ప్రతిభకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. 2009లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 150 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరించింది.

Vikramarkudu

 

విక్రమార్కుడు..

జక్కన్న కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌లో విక్రమార్కుడు ఒకటి. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృస్టించింది. 2006లో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 118 కోట్లు రాబట్టింది.

Eega

ఈగ..

ఈగ లాంటి ఒక చిన్న ప్రాణిని హీరోగా సినిమా తెరకెక్కించిన విజయాన్ని అందుకున్న ఘనత రాజమౌళిది. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 130 కోట్లు సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..