Raj Tarun: మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.. రాజ్ తరుణ్‌కు చాలా మందితో ఎఫైర్స్.. లావణ్య షాకింగ్ కామెంట్స్..
మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి లావణ్య అందుబాటులో లేనట్లు టాక్ నడిచింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
“నాకు రాజ్ తరుణ్ కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో హోటల్లో ఉంటున్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. మస్తాన్ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశాను. నాతో మైండ్ గేమ్ ఆడారు. ఆ ఆటలో మాస్తాన్ సాయి, నేను ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ లేకుండా నేను బతకలేను ” అని అన్నారు.
“నేను, మస్తాన్ సాయి ఎప్పుడు జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతడు కేవలం మ్యూచువల్ ఫ్రెండ్. నాతో ఎవరు మాట్లాడినా అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా.. ? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. డబ్బులు కోసం నేను బెదిరించాల్సిన అవసరం లేదు. చాలా భరించాను.. అతడికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.