AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: లేడీ సూపర్ స్టార్ కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా..? కొత్త మూవీ వివాదం రేపనుందా..?

తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడో వివాదాస్పద సినిమాకు ఓకే చెప్పారు. అన్నపూర్ణి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో చాలెంజిగ్‌ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. సెన్సిటివ్‌ పాయింట్‌ ను ఫన్నీగా డీల్ చేయబోతున్నట్టుగా తొలి టీజర్‌ లోనే హింట్ ఇచ్చారు మేకర్స్‌.

Nayanthara: లేడీ సూపర్ స్టార్ కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా..? కొత్త మూవీ వివాదం రేపనుందా..?
Lady Superstar Nayanthara
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Oct 25, 2023 | 5:57 PM

Share

సౌత్ ఇండస్ట్రీ నుంచి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ ను చాలా రోజులుగా మెయిన్టైన్ చేస్తున్న బ్యూటీ నయనతార. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ సత్తా చాటుతున్న ఈ బ్యూటీ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. వివాదాల్లో ఇరుక్కోకూడదన్న ఉద్దేశంతోనే తన సినిమాల ప్రమోషన్‌ లకు కూడా దూరంగా ఉంటారు ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

ఇంత జాగ్రత్తగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడో వివాదాస్పద సినిమాకు ఓకే చెప్పారు. అన్నపూర్ణి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో చాలెంజిగ్‌ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. సెన్సిటివ్‌ పాయింట్‌ ను ఫన్నీగా డీల్ చేయబోతున్నట్టుగా తొలి టీజర్‌ లోనే హింట్ ఇచ్చారు మేకర్స్‌.

నాన్‌ వెజ్‌ వంటకాల రెస్టారెంట్‌ ఓపెన్ చేయాలని కలలు గనే బ్రాహ్మణ అమ్మాయిగా నటిస్తున్నారు నయన్‌. టీజర్‌ చూడటానికి ఫన్నీ గానే ఉన్నా… ఫ్యూచర్‌ లో ఈ సినిమా వివాదాలకు కారణం అవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్, ఓ వర్గాన్ని ఇబ్బంది పెట్టాలే ఉంటుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆల్రెడీ కోలీవుడ్‌ లో అలాంటి చర్చ కూడా మొదలైంది.

ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్‌ ను డైరెక్టర్‌ నీలేష్ కుమార్ ఎలా డీల్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కెరీర్ మంచి ఫామ్‌ లో ఉన్న ఈ టైమ్‌లో నయన్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. జై హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌, కే ఎస్‌ రవికుమార్‌, అచ్యుత కుమార్‌, కార్తీక్ కుమార్‌, సురేష్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తుండగా సత్యన సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌ గా వర్క్ చేస్తున్నారు.

చివరగా జవాన్ సినిమాలో షారూఖ్‌ కు జోడిగా నటించిన నయన తార ప్రస్తుతం అన్నపూర్ణితో పాటు మన్నన్‌ గట్టి సిన్స్‌ 1960, టెస్ట్ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో ఇంత బిజీగా ఉంటూనే మరో వైపు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు. భర్త విఘ్నేష్‌ శివన్‌ తో కలిసి తన సొంత బ్యానర్‌ లో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. అదే సమయంలో ఫెమీ 9 పేరుతో కాస్మోటిక్స్‌ తో పాటు లేడీ ప్రాడక్ట్స్‌ కు సంబంధించిన బ్రాండ్‌ ను మెయిన్‌టైన్  చేస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాలు చదవండి..